రెండో రోజు కొనసాగుతోన్న గ్రామస్తుల నిరాహార దీక్ష

కరీంనగర్ :  గంగాధర మండలం మంగపేట ఎల్లమ్మ చెరువు దగ్గర రెండో రోజుగ్రామస్తుల నిరాహార దీక్ష కొనసాగుతోంది.  నారాయణ పూర్ రిజర్వాయర్ లో అంతర్భాగమైన ఎల్లమ్మ చెరువు కట్ట  మరమ్మతులు చేయకుండా  గ్రామస్థులు అడ్డుకుంటున్నారు.   చెరువులో ముంపునకు గురవుతున్న  వ్యవసాయ భూమికి  వెంటనే పరిహారం ఇచ్చి కట్ట మరమ్మతులు చేసుకోవాలని నిన్నటి నుంచి పలువురు గ్రామస్తులు, మహిళలు దీక్షకు దిగారు. రెండు రోజుల నుంచి  ఆహారం  తీసుకోకపోవడంతో కొందరు మహిళలు నీరసమొచ్చి అక్కడే పడుకున్నారు .