కరీంనగర్ క్రైం, వెలుగు: పేషెంట్ లేకున్నా ఎమర్జెన్సీ సైరన్ వేసుకుంటూ వెళుతున్న అంబులెన్స్ కు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్ ద్వారా జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ పోలీసులు రమేశ్ , ఖరీముల్లాఖాన్ ఆదివారం స్పెషల్ డ్రైవ్ లు, వాహన తనిఖీలు చేపట్టారు.
కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలో ఎమర్జెన్సీ సైరన్ వేసుకుంటూ వస్తున్న అంబులెన్స్ ను పరిశీలించగా.. అందులో ఎవరూ పేషంట్ లేకపోవడంతో చలాన్ విధించారు. అంబులెన్సులో పేషెంట్స్ లేనప్పడు ఎమర్జెన్సీ సైరన్ వాడకూడదని వారు సూచించారు. అంబులెన్సులో రోగులను తరలించే సమయంలో మాత్రమే ఎమర్జెన్సీ సైరన్ వాడాలని పేర్కొన్నారు. వాహన తనిఖీల్లో ఇషాక్, నీలవేణి రాజు తదితరులు పాల్గొన్నారు.