గాయపడిన పాముకు కుట్లువేసి.. చికిత్స చేసి..

గాయపడిన పాముకు  జంతువుల నిర్వాహకురాలు చికిత్స అందించింది. గాయాలైన చోట అచ్చం మనిషికి చేసినట్టే కుట్టు వేసి.. బ్యాండేజీ వేసింది. పాముకు రెస్ట్ కావాలని.. అది కోలుకున్న తర్వాత తిరిగి దాన్ని అడవిలో వదిలేస్తానని తెలిపింది. ఈ ఘటన కరీంనగర్ పట్టణంలో చోటు చేసుకుంది. 

కరీంనగర్ పట్టణంలోని కమాన్ ప్రాంతంలో ఓ పాము గాయాలతో పడి ఉన్నట్లు జంతువుల నిర్వాహకురాలు  శ్రీ లక్ష్మికి సమాచారం అందింది. దీంతో ఆ పామును జంతు సంరక్షణ సిబ్బంది కరీంనగర్ పశువైద్యశాలలోకి తీసుకెళ్లి చికిత్స చేశారు. గాయపడిన పాముకు వైద్యులు కుట్లు వేశారు. పాము కోలుకున్న తర్వాత దాన్ని అడవిలో వదిలేస్తామని వైద్యులు వెల్లడించారు.