చనిపోయిన ఆరు నెలల తర్వాత యూనిక్ డిజబిలిటీ కార్డు మంజూరు

మల్యాల, వెలుగు : చనిపోయిన ఆరు నెలలకు కేంద్ర ప్రభుత్వం ఆమెకు యూనిక్  డిజబిలిటీ కార్డు మంజూరు చేసింది. కరీంనగర్  జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన  తాళ్ల భద్రమ్మ (65) ఆరు నెలల క్రితం మరణించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసి యూనిక్  డిజబిలిటీ కార్డు కోసం అంతకుముందు ఆమె దరఖాస్తు చేసింది.

ఈ క్రమంలో ఆదివారం ఆమెకు కార్డు వచ్చింది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉండగా, భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. అయితే కార్డును చూసి కుటుంబ సభ్యులు అదేంటో తెలియక కంగారు పడ్డారు. డిజబిలిటీ కార్డని తెలియడంతో పక్కన పడేశామని పేర్కొన్నారు.