మట్టి గణపతులనే పూజించాలి : కలెక్టర్ పమేలాసత్పతి

మట్టి గణపతులనే పూజించాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు.  కలెక్టరేట్‌‌లో బుధవారం మట్టి గణపతి విగ్రహాలను  పూజించాలనే పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌‌‌‌ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 

పీవోపీ విగ్రహాలతో పర్యావరణానికి  నష్టం  జరుగుతుందన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో  2వేల మట్టి గణపతులను అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీసీబీ ఈఈ భిక్షపతి, వీరేశ్‌‌  పాల్గొన్నారు. 

జగిత్యాల టౌన్, వెలుగు : మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి, చెరువులను కాపాడాలని జగిత్యాల కలెక్టర్‌‌‌‌ బి.సత్యప్రసాద్‌‌ సూచించారు. బుధవారం పీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ పోస్టర్‌‌‌‌ను కలెక్టరేట్‌‌లో ఆవిష్కరించారు. 

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలతో చెరువులు కలుషితమవుతాయన్నారు. జిల్లాలో2వేల మట్టి వినాయక విగ్రహలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.