మంగళూరు: మంగళూరులో విషాద ఘటన జరిగింది. వీకెండ్లో జాలీగా గడిపి ఎంజాయ్ చేయాలని రిసార్ట్కు వెళ్లిన ముగ్గురు బీటెక్ విద్యార్థినులు.. అదే రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో శవాలై తేలారు. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మైసూరుకు చెందిన ఎన్ కీర్తన(21), నిషిత(21), పార్వతి(20) క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు యువతులు కలిసి వీకెండ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి మంగళూరులోని వాజ్కో రిసార్ట్కి (Vazco Resort VAZCO)వెళ్లారు.
వాజ్కో రిసార్ట్ యజమాని పేరు మనోహర్. నవంబర్ 16న ఈ ముగ్గురు యువతులు రిసార్ట్కు చేరుకున్నారు. నైట్ మొత్తం రిసార్ట్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. నవంబర్ 17న ఉదయం 10 గంటలకు ముగ్గురు యువతులు స్విమ్మింగ్ పూల్లో దిగారు. ముగ్గురూ స్విమ్మింగ్ పూల్ లో కొద్దిసేపు ఎంజాయ్ చేశారు.
— Hate Detector 🔍 (@HateDetectors) November 18, 2024
ఫోన్లో వీడియోలు తీసుకున్నారు. అప్పటివరకూ అంతా బానే ఉంది. కానీ.. ఈ ముగ్గురూ ఎప్పుడైతే గమనించకుండా స్విమ్మింగ్ పూల్లో లోతైన చోటకి వెళ్లారో అక్కడే మృత్యు ఘంటికలు మోగాయి. ఒక యువతి లోతైన చోట మునిగిపోతూ కనిపించడంతో మిగిలిన ఇద్దరు యువతులు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ముగ్గురికీ ఈత రాకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు ఆ లోతైన చోట మునిగిపోయారు. ఇలా.. ముగ్గురూ మునిగిపోయి కొంతసేపటికే స్విమింగ్ పూల్లో శవాలై తేలారు. ఇలా ఈ ముగ్గురు యువతుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో రిసార్ట్ యజమాని మనోహర్తో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఆ రిసార్ట్ లో ఏడుగురు పనిచేస్తున్నారని, సహాయం కోసం ఆ యువతులు కేకలేసి అలారం రైజ్ చేసినప్పుడు ఒక్కరు కూడా స్పందించలేదని చెప్పారు. ఆ సమయంలో రిసార్ట్లో స్టాఫ్ ఎవరూ లేరని తేలిందన్నారు. రిసార్ట్లో లోతు ఎంత ఉందనే విషయాన్ని స్విమింగ్ పూల్ దగ్గర మెన్షన్ చేయలేదని, ఈ రిసార్ట్ను సీజ్ చేసి ట్రేడ్ లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేశామని మంగళూరు కమిషనర్ తెలిపారు.