Bank Jobs: ఈ బ్యాంక్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..! మెట్రో నగరాల్లో పని చేస్తే లక్షకు పైగా జీతం

Bank Jobs: ఈ బ్యాంక్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా..! మెట్రో నగరాల్లో పని చేస్తే లక్షకు పైగా జీతం

కర్ణాటక బ్యాంక్ మరో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో ముందుకొచ్చింది. ఈసారి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు లేదా డిగ్రీ (లా/ అగ్రికల్చరల్ సైన్స్) లేదా సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల వారు డిసెంబర్ 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు: ఏదేని విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ (లా/ అగ్రికల్చరల్ సైన్స్) లేదా సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ పూర్తి చేసిన వారు అర్హులు.

వయోపరిమితి: 01/ 11/ 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్/ OBC/ ఇతరులు రూ. 800/- (పన్నులు అదనం) చెల్లించాలి. SC/ST అభ్యర్థులు రూ. 700/- (పన్నులు అదనం) చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు (స్కేల్-I) కింద రూ.48,480 చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ అలవెన్సులు అదనం. మెట్రో నగరాల్లో పని చేస్తే లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభ తేది: 30/ 11/ 2024
  • దరఖాస్తులకు చివరి తేదీ: 10/ 12/ 2024
  • తాత్కాలిక పరీక్ష తేదీ: 22/ 12/ 2024

నోటిఫికేషన్ కోసం Karnataka Bank PO Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేయండి.