
కర్ణాకట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కౌమారదశలో ఉన్నవారికి శారీరక, భావోద్వేగ,హార్మోన్ల మార్పుల గురించి మినిమం నాలెడ్జ్ ఉండటం చాలా అవసరమని ప్రభుత్వం తెలిపింది. పాఠశాలల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక అవతరించనుంది. అదేవిధంగా సైబర్ పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టింది కర్ణాటక ప్రభుత్వం.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో 8నుంచి 12 తరగతుల విద్యార్థులకు లైంగిక విద్యను బోధించనున్నట్లు కర్ణాటక విద్యామంత్రి స్వయంగా ప్రకటించారు. శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి కౌమారదశలో విద్యార్థులకు అవసరమైన జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ALSO READ | 48 మంది లీడర్లపై హనీ ట్రాప్.. కర్నాటక అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న
వారానికి రెండుసార్లు వైద్య నిపుణులచే ఈ క్లాసులు నిర్వహించనున్నాట్లు మంత్రి చెప్పారు. ఏడాదికి రెండుసార్లు విద్యార్థులు ఆరోగ్యం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిశుభ్రతపై విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది విద్యార్థులకు పరిశుభ్రత, అంటు వ్యాధులు, డ్రగ్స్ వినియోగం, ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు.
లైంగిక విద్యతో పాటు, డిజిటల్ ఎడిక్షన్, ప్రీమెచ్యూర్ సెక్సువల్ యాక్టివిటీ, టీనేజ్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యలపై ప్రత్యేక తరగతులను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు మోరల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి సబ్జెక్టుగా మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారానికి రెండుసార్లు సెషన్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పాఠ్యాంశాలు సమగ్రత, నిజాయితీ,సహనం వంటి విలువలను విద్యార్థుల్లో అలవర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు.