బీజేపీ అభివృద్ధిలో బూత్ స్థాయి కార్యకర్తలే కీలకం : అభయ్ పాటిల్

ఎల్లారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తలు కృషి చేయాలని కర్నాటక, బెల్​గావ్​ఎమ్మెల్యే అభయ్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలోని ఓ ప్రైవేట్​ఫంక్షన్​హాల్​లో నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి చీఫ్ గెస్ట్ గా బెల్గావ్ ఎమ్మెల్యే అభయ్ పాటిల్, పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి హాజరయ్యారు. అభయ్ పాటిల్ మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలతోనే బీజేపీ గ్రామస్థాయిలో బలోపేతమవుతుందన్నారు.

రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం సాధ్యం కానీ హామీలిచ్చి, ప్రజలను మోసం చేసి చేస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైండ్ల పోచన్న మాట్లాడుతూ.. ఎల్లారెడ్డిలో బీజేపీ బలంగా ఉందని, బూత్ స్థాయి కార్యకర్తలు, లీడర్లు కృషి చేస్తే భారీ మెజార్టీతో విజయం సాధ్యమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​చార్జి​ బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు కృష్ణా రెడ్డి, జిల్లా నాయకులు దేవేందర్, బాలకిషన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.