లంచం ఇవ్వకపోతే చంపేస్తారేయ్..! కాంట్రాక్టర్‌ను బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

లంచం ఇవ్వకపోతే చంపేస్తారేయ్..! కాంట్రాక్టర్‌ను బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

లంచం ఇవ్వనందుకు ఓ దళిత కాంట్రాక్టర్‌ను దూషించడం, చంపేస్తానని బెదిరించాడన్న ఆరోపణలపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కోలార్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే అయిన మునిరత్న తనను బెదిరిస్తున్నారని బిజెపి నాయకుడు చెల్వరాజు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎమ్మెల్యేపై వైయాలికావల్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. అంతకుముందు మునిరత్న తనను లంచం కోసం వేధించాడని చెల్వరాజు మీడియా సమావేశంలో ఓ ఆడియో క్లిప్‌ విడుదల చేశారు. అది బాగా వైరల్ అయ్యింది.

అరెస్ట్ నేపథ్యంలో మునిరత్న ఇంటి బయట పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యలుగా కొన్ని రహదారులను మూసివేశారు.

మునిరత్న పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని పేర్కొంటూ, తనపై వచ్చిన ఆరోపణలపై ఐదు రోజుల్లోగా క్రమశిక్షణా సంఘం ముందు వివరణ ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ మునిరత్నకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.