తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరు సీబీఐకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని అధికారులను ఆదేశించింది. బుధవారం (జవవరి 29) న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కేసుల ప్రత్యేక కోర్టులో జయలలిత ఆక్రమాస్తుల కేసు విచారణకు వచ్చింది.
కేసు విచారణ చేపట్టిన జస్టిస్ హెచ్ఎ మోహన్.. జయలలిత ఆస్తులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 14 లేదా 15 తేదీలోపు జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పాలని అధికారులను ఆదేశించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలంటూ జయలలిత చట్టపరమైన వారసులు చేసిన అప్పీల్‌ను హైకోర్టులో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. జయలలిత మేనల్లుడు ,మేనకోడలు - జె దీపక్,జె దీప సిబిఐ కోర్టులో వారి పూర్వపు అభ్యర్థనను కొట్టివేసిన తరువాత హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 13న కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
2024 ఫిబ్రవరిలో సీబీఐ కోర్టు అదే సంవత్సరం మార్చి నాటికి ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని భావించింది. దీప ,దీపక్ కర్ణాటక హైకోర్టు నుంచిస్టే ఆర్డర్‌ను పొందారు. అయితే జనవరి నెల ప్రారంభంలో హైకోర్టు వారి పిటిషన్‌ను తిరస్కరించింది.
జయలలిత వారసుల పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీశానంద.. పేదలకు సేవ చేసేందుకు జయలలిత పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. భౌతిక సంపద శాశ్వతంగా కాదు.. ఆమె వారసత్వానికి శాంతి కలిగించే మంచి పనులు చేయాలని పిటిషనర్లకు జస్టిస్ వి శ్రీశానంద సూచించారు.