- మంత్రిపై ఆరోపణలు చేసిన మరుసటి రోజే లాడ్జ్ లో అనుమానాస్పద మృతి
బెంగళూరు: కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి.. కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పంచాయతీ రాజ్ మంత్రి ఈశ్వరప్ప తనను 40 శాతం కమిషన్ అడిగారని ఆరోపించిన మరుసటి రోజే కాంట్రాక్టర్ పాటిల్ ఓ లాడ్జ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఈ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తొలగించాలని సిద్ధిరామయ్య డిమాండ్ చేశారు. అయితే ఈఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి ఈశ్వరప్ప తనపై ఆరోపణలు చేసినవారిపై పరువునష్టందావా వేశారు. పాటిల్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ప్రకటించారు. బాధ్యులెవరైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
జలమండలి మేనేజర్, వర్క్ ఇన్‌స్టెక్టర్ సస్పెండ్
అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం
చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు