- జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు కర్నాటక డిప్యూటీ సీఎం
- చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పరిశీలించిన డీకే శివకుమార్
జవహర్ నగర్/జీడిమెట్ల, వెలుగు : సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. అక్కడ చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ, చెత్తను ఏ విధంగా తరలిస్తున్నారు.. ఎలా రీసైక్లింగ్ చేస్తున్నారని విషయాలను తెలుసుకున్నాని చెప్పారు. పవర్ ప్లాంట్ పనితీరును కూడా రాంకీ యాజమాన్యం తనకు వివరించిందని తెలిపారు.
Also Raed:-సీఎం వస్తున్నారని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు
చెత్త నుంచి కరెంట్, ఎరువులను తయారు చేస్తన్న విధానాన్ని పరిశీలించామని, ఇదే తరహాలో కర్నాటకలో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే, జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణ్ కుమార్ వెంట మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేశ్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.