నా కూతురు ఇలాచేస్తుందనుకోలే.. నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్పై కర్నాటక డీజీపీ రెస్పాన్స్

నా కూతురు ఇలాచేస్తుందనుకోలే.. నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్పై కర్నాటక డీజీపీ రెస్పాన్స్

బెంగళూరు: కన్నడ యాక్టర్ రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్​ ఘటనపై ఆమె తండ్రి, కర్నాటక డీజీపీ రామచంద్రారావు స్పందించారు. ఈ విషయం మీడియా ద్వారా తెలియగానే షాకయ్యానని చెప్పారు. ‘‘4 నెలల కిందే రన్యాకు పెండ్లయింది. అప్పటినుంచి భర్తతో ఉంటోంది. మమ్మల్ని కలవలేదు. తన గురించిగానీ, తన భర్త బిజినెస్​ గురించిగానీ మాకేమీ తెలియదు. విషయం తెలిసి మేమంతా షాకయ్యాం. బాధపడ్డాం. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాపై ఒక్క మచ్చకూడా లేదు. ఈ వ్యవహారానికి నేను దూరంగా ఉండాలనుకుంటున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని రామచంద్రారావు అన్నారు.

అసలేం జరిగిందంటే.. 

రన్యారవు కన్నడ నటి. ఆమె ఈ నెల 4న దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్​పోర్టుకు వచ్చారు. అధికారుల తనిఖీలలో 14.8 కిలోల బంగారం అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది.  దీంతో ఆమెను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్​కు తరలించారు.