సీట్లలోనే కాదు.. ఓట్లలో కూడా కాంగ్రెస్ సరికొత్త రికార్డ్

సీట్లలోనే కాదు.. ఓట్లలో కూడా కాంగ్రెస్ సరికొత్త రికార్డ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన కాంగ్రెస్.. స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే.. సీట్లలోనే కాదు, ఓట్ల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ తన దూకుడు ప్రదర్శిస్తోంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 40 శాతం సీట్లు పెంచుకున్న కాంగ్రెస్.. ఓట్లలో కూడా అదే శాతాన్ని రాబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడిస్తోంది. ఇక సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన బీజేపీ ఓట్ల విషయంలో మాత్రం తన ఓటు బ్యాంక్ ను కాపాడుకున్నట్లే కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఈసారి కూడా అదే స్థాయిలో ఓట్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే..  ఈ ఎన్నికల్లో జనతాదళ్ సెక్యూలర్ పార్టీ ఓట్ల శాతం చాలా పడిపోయింది. గత ఎన్నికల్లో 18.3 ఓట్లు సాధించిన ఆ పార్టీ.. ఈసారి కేవలం 13 ఓట్ల శాతం వద్దే ఆగిపోయినట్లు తెలుస్తోంది.