Karnataka Election Results 2023 : లైవ్ అప్టేడ్స్

Karnataka Election Results 2023  : లైవ్ అప్టేడ్స్

6:30గంటలకు ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ :

కాంగ్రెస్ పార్టీ 126  సీట్లలో విజయం సాధించగా.. మరో 10  నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 60 స్థానాల్లో గెలవగా.. మరో5 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇతరులు 4  స్థానాల్లో గెలిచారు.

 

కాంగ్రెస్ కు విషెస్ చెప్పిన ప్రధాని మోడీ

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై ప్రధాని మోడీ స్పందించారు. కాంగ్రెస్ కు అభినందనలు తెలిపారు. కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను  కాంగ్రెస్ నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని  ట్విట్ చేశారు మోడీ.  రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషిని అభినందించారు మోడీ. 

అవినీతిప్రభుత్వాన్ని గద్దె దింపారు:  ప్రియాంక

కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. కర్ణాటకలో అవితీని ప్రభుత్వాన్ని సాగనంపారని విమర్శించారు. మత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని అన్నారు.  ప్రజా సమస్యలపై పోరాడేది కాంగ్రెస్సేనని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.  రాహుల్ నాయకత్వంలో తాము పోరాడామన్నారు.  భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ లో జోష్ నింపిందని చెప్పారు.  ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. 

ఓడినా బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలే: బండి సంజయ్

కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించాయని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు.  కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో గెలవగానే ఇంతలా రెచ్చిపోతున్నారని.. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు.  కర్ణాటకలో ఓడినా.. బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కు చెదరలేదని చెప్పారు.  ఒక వర్గం ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తోందన్నారు. తెలంగాణలో జరిగిన 5 ఉప ఎన్నికల్లో రెండింటిలో  బీజేపీ  గెలిచిందన్నారు

 కర్ణాటకలో అన్ని పార్టీలు మత రాజకీయాలు చేశాయని విమర్శించాయి బండి సంజయ్. 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మత రాజకీయాలు చేసిందెవరని ప్రశ్నించారు . ఫక్తు మత రాజకీయాలు చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు.  కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో పనిచేయబోవన్నారు.

14న సీఎల్పీ భేటీ..15న ప్రమాణ స్వీకారం

 బెంగళూరులోని హిల్టన్ హోటల్ లో రేపు మధ్యాహ్నం 12.30గంటలకు  సీఎల్పీ భేటీ కానుంది. ఎమ్మెల్యేలు సీఎల్పీ లీడర్ ను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీపడుతున్నారు. సీఎం అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందా అని ఉత్కంఠగా ఉంది. మే 15న కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.

4:55 గంటలకు ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ :

కాంగ్రెస్ పార్టీ 111  సీట్లలో విజయం సాధించగా.. మరో 25 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 50 స్థానాల్లో గెలవగా.. మరో 14 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 4 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4  స్థానాల్లో గెలిచారు

 

బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని ఓడించిన్రు: రేవంత్ రెడ్డి

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. భారత్ జోడోయాత్రతో కాంగ్రెస్ లో జోష్ వచ్చిందన్నారు.  జోడో యాత్ర తర్వాత  కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోందన్నారు. హిమాచల్ లో తొలి విజయం, కర్ణాటకలో  రెండో విజయం, తెలంగాణలో మూడో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 

కర్ణాటకలో  మత రాజకీయాలను  ప్రజలు తిప్పికొట్టారని రేవంత్ అన్నారు.  కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసమే కానీ.. రాజకీయ అంశం  కాదన్నారు. మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీని ప్రజలు తిప్పి కొట్టి  మోడీ నాయకత్వాన్ని ఓడించారని తెలిపారు. 

జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కరించారని రేవంత్ అన్నారు.  బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని ఓడించారని చెప్పారు.  కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయన్నారు.   కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు బీఆర్ఎస్ కు ఇష్టం లేదని.  అందుకే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం కాబోవని కేటీఆర్ ట్వీట్ చేశారన్నారు.

 

బీజేపీ పొరపాట్ల కారణంగానే ఓడిపోయాం: కిషన్ రెడ్డి

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల కారణంగానే ఓడిపోయామని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  కర్ణాటకలో బీజేపీ ఒక తప్పు చేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ వంద తప్పులు చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు.

 కర్ణాటక ప్రజల తీర్పును శిరసావహిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. తప్పులను సరిచేసుకుని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. స్థానికంగా ఉన్న  ప్రభుత్వం వ్యతిరేకత వల్లే తాము ఓడిపోయామన్నారు. తమ లోపాలను  సరిదిద్దుకుని తొందర్లోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు బాగా ధైర్యం వస్తోందన్న ప్రచారం ఒట్టిదేనన్నారు కిషన్ రెడ్డి.

 రాహుల్ తప్పకుండా ప్రధాని అవుతారు: సిద్ధరామయ్య

రాష్ట్రంలో బీజేపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.  డబ్బుతో గెలవాలన్న బీజేపీ కుట్రను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా పెద్ద విజయమని అన్నారు.  కర్ణాటక ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని..రాహుల్ తప్పకుండా  ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.  

ప్రజా తీర్పును గౌరవిస్తాం: కుమార స్వామి

కర్ణాటకలో కొత్తప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ప్రజా సమ్యలను పరిష్కారించాలని కాంగ్రెస్ ను కోరారు.  ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతోందన్నారు. తమకు మద్దతు తెలిపి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తది 

కర్ణాటకలో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కన్నడ ఎన్నికల్లో కాంగ్రెస్  అద్భుత విజయం సాధించిందని..బీజేపీ దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడారని చెప్పారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల మంత్రులు కర్ణాటకలో ప్రచారం చేసినా.. ప్రజలు కలిసికట్టుగా కాంగ్రెస్‌కే పట్టం కట్టారన్నారు.  కాంగ్రెస్ మంచి ప్రదర్శన జనతా జనార్దన విజయమన్నారు. ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇచ్చారని చెప్పారు.  దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు కోపంతో కాంగ్రెస్ కు  ఓటు వేశారన్నారు.

కర్ణాటకలో గెలిచిన ఎమ్మెల్యేలందరిని మే 13వ తేదీ సాయంత్రం బెంగుళూరుకు రావాలని ఆదేశించామని..బెంగుళూరులో జరిగే సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు..ముఖ్యమైన అంశాలపై చర్చిస్తామన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు మల్లికార్జున్‌ ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని.. మేనిఫెస్టోలో  ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామన్నారు.

3:25 గంటలకు ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ :

కాంగ్రెస్ పార్టీ 55 సీట్లలో విజయం సాధించగా.. మరో 80 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ పార్టీ 22 స్థానాల్లో గెలవగా.. మరో 43 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 10 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో గెలవగా.. మరో 2 చోట్ల లీడ్ లో ఉన్నారు

కర్ణాటక  ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు

కర్ణాటక ప్రజలను రంజింప చేయడంలో  కేరళ స్టోరీ విఫలమైందన్నారు మంత్రి కేటీఆర్. నీచమైన, విభజన రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోన్నారు.

బీజేపీకి గెలుపోటములు కొత్తకాదు

 కర్ణాటకలో పార్టీ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని  ఆ పార్టీ సీనియర్ నేత యాడ్యురప్ప అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఓటమిపై పార్టీ నేతలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 

బలవంతులపై బలహీనుల విజయమిది : రాహుల్​ గాంధీ

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై  కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ స్పందిచారు.  ఇది  బలవంతులపై బలహీనులు సాధించిన విజయంగా ఆయన అభివర్ణి్ంచారు.  పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన  నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 

తాము నిజాయతీతో, ప్రేమతో పోరాటం చేశామని దాన్ని ప్రజలు స్వీకరించి ఇంత పెద్ద విజయం అందించారని పేర్కొన్నారు. పేదల కోసం కాంగ్రెస్​ పోరాడిందని అన్నారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. 

తొలి క్యాబినెట్​లోనే ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే  అన్ని రాష్ట్రాల్లో రిపీట్​ అవుతాయని రాహుల్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రేమతో కన్నడ ప్రజల మనసులు గెలుచుకున్నాం అని అన్నారు. రాహుల్​ పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది. 

రాజీనామా

సీఎం పదవికి రాజీనామా చేసిన బసవరాజు బొమ్మై

ఘోరంగా దెబ్బతిన్న జేడీఎస్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు జేడీఎస్‌ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈసారి జేడీఎస్‌ దారుణంగా దెబ్బతింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందగా.. ఈ ఎలక్షన్స్‌లో 21 స్థానాలకే పరిమితమైంది. కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. 

స్వీట్లు పంచిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు దాదాపు ఖాయం కావడంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌ కూడా స్వీట్లు పంచి తన ఆనందాన్ని పంచుకున్నారు.

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన కాంగ్రెస్‌ 

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెజార్టీ ఫిగర్‌ (113)ను దాటేసింది. ఇంకా 19 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కన్నడినాట కాంగ్రెస్‌ అధికారాన్ని చేజిక్కించుకుంది. మరోవైపు బీజేపీ 53 స్థానాల్లో గెలుపొంది... రెండో స్థానంలో ఉంది. ఇంకా 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్‌ పాతిక స్థానాలను చేరుకోలేకపోయింది. ఇప్పటివరకు జేడీఎస్‌ 17 స్థానాల్లో గెలుపొందింది.

సీఎం పదవిపై భావోద్వేగంతో స్పందించిన డీకే శివ కుమార్ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన గెలుపు ఖాయమైన అనంతరం కేపీసీసీ చీఫ్‌ డేకే శివకుమార్‌ మాట్లాడారు. పార్టీ గెలుపులో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరి పాత్ర ఉందని అన్నారు. మీరే సీఎం కావాలని మీ మద్దతుదారులు కోరుకుంటున్నారుగా.. మరి మీరు రేసులో ఉన్నారా..? అన్న మీడియా ప్రశ్నతో ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.

కాంగ్రెస్‌ పార్టీలో తనకు మద్దతుదారులంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరని, మొత్తం కాంగ్రెస్‌ పార్టీయే తనకు మద్దతుగా ఉందని భావోద్వేగంతో చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తాము చాలా కష్టపడ్డామన్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌లోని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గేతోపాటు, రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా తమకు సహకరించారని చెప్పారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా పార్టీని గెలిపించడంలో తనకు మద్దతు నిలిచారని తెలిపారు. 

పనిచేయని ‘ది కేరళ స్టోరీ’, భజరంగ్‌దళ్ అంశాలు

‘ది కేరళ సినిమా’... దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధించాయి. అయినా ఈ మూవీకి బీజేపీ ఫుల్ సపోర్ట్ చేసింది. కర్ణాటక ఎన్నికల్లో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. లవ్ జీహాద్ అంశం తెరపైకి వచ్చింది. ఇదే విధంగా.. భజరంగ్ దళ్ లాంటి సంస్థలు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాటిని నిషేధిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పడంతో... ఆ అంశం కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ ఈ రెండు అంశాలూ తమకు కలిసి వస్తాయని అంచనా వేసుకుంది. కానీ.. ఎక్కడా ఈ అంశాలు బీజేపీకి ప్లస్ అయినట్లు కనిపించలేదు. స్థానిక సమస్యలు, అవినీతి వంటి అంశాలే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.

ఖర్గే తనయుడి విజయం..

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ విజయం సాధించారు. చిత్తాపూర్ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 

2 వేల ఓట్ల ఆధిక్యంతో ‘గాలి’ విజయం

కర్ణాటక ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి పోటీ చేసిన గాలి జనార్దన్​రెడ్డి తన ప్రత్యర్థులపై 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు గంగావతి నుంచి పోటీ చేయగా గాలి జనార్ధన్ రెడ్డి గెలుపొందారు.  

https://www.v6velugu.com/gali-janardhan-reddy-won-by-2-thousand-votes-from-kalyana-rajya-pragathi-paksha-party

కుమారస్వామి కొడుకు నిఖిల్ ఓటమి 

జేడీఎస్ కు బిగ్ షాక్ తగిలింది. జేడీఎస్ అధినేత హెచ్‌డి  కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ ఓడిపోయారు. రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ చేతిలో 13,459 ఓట్లతో ఓడిపోయారు.  

కుమారస్వామి కుటుంబానికి కంచుకోట అయిన రామనగర అసెంబ్లీ సీటును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. కుమార‌స్వామి భార్య రామ‌న‌గ‌ర నుంచి టికెట్ ను త్యాగం చేసి నిఖిల్ కుమార‌గౌడ కు అవ‌కాశం ఇచ్చారు. అయినప్పటికీ జేడీఎస్ తన కంచుకోటను కాపాడుకోలేకపోయింది.  

 https://www.v6velugu.com/nikhil-kumaraswamy-loss-ramanagara-seat

2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యాలో నటి సుమలత అంబరీష్ పై పోటీ చేసి ఓడిపోయారు నిఖిల్ కుమారస్వామి. ఇక హెచ్‌డి  కుమారస్వామి చెన్నపట్టణ నుంచి గెలుపొందారు. 

సీఎం బొమ్మై గెలిచినా.. మంత్రులకు తప్పని ఓటమి

కర్ణాటక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం బొమ్మై గెలిచారు. కానీ, ఆయన కేబినెట్‌లోని మంత్రులు చాలామంది ఓటమి చవిచూస్తున్నారు. బళ్లారి (ఎస్టీ) స్థానంలో శ్రీరాములుపై కాంగ్రెస్‌ అభ్యర్థి నాగేంద్ర గెలుపొందారు. చిక్కబళ్లాపూర్‌లో మంత్రి సుధాకర్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రదీప్‌ ఈశ్వర్‌ విజయం సాధించారు. మరో ఆరుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అయితే సీఎం బొమ్మై షిగ్గావ్‌లో గెలుపొందారు.

12:45 గంటలకు ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ 

కాంగ్రెస్ పార్టీ 128 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉండగా.. రెండు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 66 సీట్లలో లీడ్ లో ఉండగా.. జేడీఎస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు 4 చోట్ల లీడ్ లో ఉన్నారు.

మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యాం : బొమ్మై

మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని సీఎం, బీజేపీ నేత బసవరాజ్‌ బొమ్మై వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చాక సమగ్రంగా విశ్లేషించుకుంటామని తెలిపారు. 

బ్రహ్మానందం ప్రచారం చేసిన మంత్రి సుధాకర్ ఓటమి

తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన బీజేపీ మంత్రి సుధాకర్ ఓడిపోయారు. ప్రస్తుతం సుధాకర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన బీజేపీ తరపున చిక్ బల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కు నటుడు బ్రహ్మానందం స్నేహితుడు కావటంతో.. నాలుగు రోజులపాటు ఆయన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు. 

గత ఎన్నికల్లో మాత్రం గెలుపు వరించింది. ఇదే స్ట్రాటజీని రిపీట్ చేసినా.. బ్రహ్మానందం ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. బ్రహ్మానందం తెలుగు బాషలోనే పంచ్ లు పేల్చారు.. కామెడీ చేశారు.. ఓటర్లను ఆకర్షించారు. అయినా సుధాకర్ కు ఓటమి తప్పలేదు.

మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌ ఓటమి..

హుబ్లీ- ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్‌ షెట్టర్ ఓటమి పాలయ్యారు. మొదటి నుంచి ఆయన వెనుకంజలోనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన షెట్టర్‌కు బీజేపీ టికెట్‌ నిరాకరించడంతో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు.

బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ఓటమి

బళ్లారి (ఎస్‌టీ) స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నాగేంద్ర ఆయనపై విజయం సాధించారు. శ్రీరాములు గతంలో.. ఐదు సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు.

సీఎం బొమ్మై విజయం..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విజయం సాధించారు.  షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌ పై  20,000 ఓట్లకు పైగా గెలుపొందారు. బొమ్మైకి 59,242 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పఠాన్‌కు 37,723 ఓట్లు వచ్చాయి. ఇది ఆయనకు వరుసగా నాలుగోసారి విజయం కావడం విశేషం. ఇక జేడీఎస్ కు  చెందిన శశిధర్ యెలిగర్ మూడో స్థానంలో నిలిచారు.

 https://www.v6velugu.com/karnataka-cm-basavaraj-bommais-victory

కాంగ్రెస్ సంబరాలు 

నందిని మిల్క్ గెలిచింది.. అమూల్ పాలు ఓడింది అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర సంబరాలు

డీకే శివకుమార్ విజయం

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం సాధించారు. కనకపురా నియోజకవర్గం నుంచి ఆయన వరసగా నాలుగోసారి గెలిచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులు 123 స్థానాల్లో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షులు డీకే శివకుమార్​ కనకపుర నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అక్కడి నుంచి ఆయన వరుసగా నాలుగోసారి గెలుపొందడం విశేషం. కాంగ్రెస్​ విజయానికి అడుగుదూరంలో ఉండటంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫుల్​జోష్​లో ఉన్నారు.

https://www.v6velugu.com/pcc-chief-dk-shivakumars-victory-in-karnataka-assembly-elections-from-kanakapura

గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగులుతోంది. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు. గాలి జనార్థన్ రెడ్డితో పాటుగా 15 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఎన్నికల్లో  పోటీ చేశారు. గంగావతి అసెంబ్లీ స్థానం నుండి గాలి జనార్ధన్ రెడ్డి పోటీ చేయగా, బళ్లారి నుంచి ఆయన భార్య అరుణ బరిలో నిలిచారు. గాలి జనార్థన్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా, ఆయన భార్యతో పాటుగా మిగతా అభ్యర్థులందరూ వెనకంజలోనే ఉన్నారు. 15 స్థానాల్లో పోటీ చేసిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క గంగావతిలో తప్ప.. మిగతా 14 స్థానాల్లో  కాంగ్రెస్  పార్టీనే ఆధిక్యంలో ఉంది.
 

సీట్లలోనే కాదు.. ఓట్లలో కూడా కాంగ్రెస్ సరికొత్త రికార్డ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన కాంగ్రెస్.. స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే.. సీట్లలోనే కాదు... ఓట్ల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ తన దూకుడు ప్రదర్శిస్తోంది. 

గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 40 శాతం సీట్లు పెంచుకున్న కాంగ్రెస్.. ఓట్లలో కూడా అదే శాతాన్ని రాబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడిస్తోంది. ఇక సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన బీజేపీ ఓట్ల విషయంలో మాత్రం తన ఓటు బ్యాంక్ ను కాపాడుకున్నట్లే కనిపిస్తోంది. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 36 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఈసారి కూడా అదే స్థాయిలో ఓట్లు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే..  ఈ ఎన్నికల్లో జనతాదళ్ సెక్యూలర్ పార్టీ ఓట్ల శాతం చాలా పడిపోయింది. గత ఎన్నికల్లో 18.3 ఓట్లు సాధించిన ఆ పార్టీ.. ఈసారి కేవలం 13 ఓట్ల శాతం వద్దే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

https://www.v6velugu.com/karnataka-election-results-2023-congress-increasing-vote-percentage-

సొంతగూటికి కాంగ్రెస్​ రెబల్స్..!

కాంగ్రెస్​ నుంచి బయటకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లీడ్​ లో ఉన్నారు. కాంగ్రెస్​స్టేట్​చీఫ్ డీకే శివకుమార్​వారిని సొంతగూటికి రప్పించాలని చూస్తున్నారు. వారితో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయిదుగురు రెబల్స్​తో కాంగ్రెస్ పెద్దలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

మత రాజకీయాలు కర్నాటకలో పని చేయవని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్​అని డీకే శివకుమార్ మీడియాతో చెప్పారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కర్నాటకలో సొంతంగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బెంగళూరు సిటీలో కాంగ్రెస్ దే పైచేయి

బెంగళూరు సిటీ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 16 చోట్ల కాంగ్రెస్ లీడ్ లో ఉంది.

13 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్ వేగంగా సాగుతుంది. మొత్తం 19 రౌండ్లకు.. ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయానికి 13 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కేవలం స్థానాలకు మాత్రమే గెలుపు ప్రకటించారు అధికారులు. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. మరో ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంది.

మత రాజకీయాలు పని చేయలేదు : సిద్ధరామయ్య

కర్ణాటక రాష్ట్రంలో మత రాజకీయాలు పని చేయవని.. ప్రజలు కష్టాల్లో ఉంటే బీజేపీ రాజకీయాలు చేసిందన్నారు సిద్దరామయ్య. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. 120 సీట్లలో కచ్చితంగా గెలుస్తామన్నారు సిద్దరామయ్య. బీజేపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ఆ పార్టీకి గుణపాఠం చెప్పారన్నారు.

https://www.v6velugu.com/siddaramaiah-respond-on-karnataka-assembly-election-result-

  • ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం చేసిన  42 స్థానాల్లో బీజేపీ 21 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. 21స్థానాల్లో బీజేపీ వెనకంజలో ఉంది. 
  • అమిత్ షా ప్రచారం చేసిన 30 స్థానాల్లో బీజేపీ 10 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. 20 స్థానాల్లో బీజేపీ వెనకంజలో ఉంది. 
  • రాహుల్ గాంధీ ర్యాలీ చేసిన 51 స్థానాల్లో కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉంది. 15 స్థానాల్లో కాంగ్రెస్ వెనకంజలో ఉంది. 
  • ప్రియాంక గాంధీ ర్యాలీ చేసిన 27 స్థానాల్లో కాంగ్రెస్ 13 స్థానాల్లో ముందంజలో ఉంది. 14 స్థానాల్లో కాంగ్రెస్ వెనకంజలో ఉంది. 

విజయం దిశగా కాంగ్రెస్ 

కర్ణాటక లో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే లీడ్ లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అధికారంలో ఉన్న పార్టీని ఓడించాలన్న సంప్రదాయాన్ని కర్నాటక ఓటర్లు కొనసాగించారు. 

11:11 గంటలకు ఎలక్షన్ కమిషన్ ట్రెండ్ :

కాంగ్రెస్ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 72 సీట్లలో లీడ్ లో ఉంది. ఇక జేడీఎస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇతరులు 5 చోట్ల లీడ్ లో ఉన్నారు.
 

11 : 00 గంటలకు ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ :

కాంగ్రెస్ 114 స్థానాల్లో.. బీజేపీ 73 సీట్లలో.. జేడీఎస్ 30 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. గాలి జనార్థన్ రెడ్డి ఒక్కరు మాత్రమే లీడ్ లో ఉన్నారు. ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. లీడ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్ పార్టీ. 

  • బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జేడీఎస్ అధినేత కుమారస్వామితో బీజేపీ నేతల భేటీ

ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్

కర్నాటకలో ఎన్నికల ఫలితాలు వేగంగా వచ్చేస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి 224 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.117 స్థానాల్లో లీడ్ లో ఉంది. అధికారం చేపట్టటానికి 113 సీట్లు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 117 చోట్ల ఆధిక్యంలో ఉంది. 

ఇక బీజేపీ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కుమారస్వామి జేడీఎస్ పార్టీ 29 చోట్ల లీడ్ లో ఉన్నాయి. ఇతరులు ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ దిశగా వెళుతున్నట్లు ట్రెండ్స్  చెబుతున్నాయి. అధికారిక ప్రకటన మధ్యాహ్నం రెండు గంటలకు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

వెనుకంజలో కెచ్చా సుదీప్ ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి

బీజేపీ తరుపున కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎస్ తిప్పేస్వామి తరుపున నాలుగు రోజులు ప్రచారం చేశారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కె సి వీరేంద్ర లీడ్ లో ఉన్నారు. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత  తిప్పేస్వామిపై  వీరేంద్ర 1,0591 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక పూర్తి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి రేపుతోంది. మొలకాల్మూరు నియోజక వర్గం నుండి పోటీ చేసిన తిప్పేస్వామి బరిలో నిలిచారు.

జోష్ లో కాంగ్రెస్ శ్రేణులు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతుండటంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. మాజీ సీఎం సిద్దరామయ్య బెంగూళూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని విక్టరీ సింబల్ చూపించారు.

వెనుకంజలో బ్రహ్మానందం ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి 

చిక్ బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి (వైద్యారోగ్య శాఖ మంత్రి) సుధాకర్​కు మద్దతుగా కమెడియన్​ బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. రోడ్​ షో చేస్తూ సుధాకర్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ లీడ్ లో ఉన్నారు. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ప్రదీప్ ఈశ్వర్.. బీజేపీ అభ్యర్థి.. బ్రహ్మానందం స్నేహితుడు సుధాకర్ పై 3 వేల 299 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

ఈ క్రమంలోనే గత ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుధాకర్ గెలుపొందారు. ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో.. సుధాకర్ తన ఫ్రెండ్ బ్రహ్మానందంతో కలిసి చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు ప్రచారం చేయించారు. అయితే ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి రేపుతోంది.

10 : 32 గంటలకు ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ :

కాంగ్రెస్ 111 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 73 చోట్ల, జేడీఎస్ 30 సీట్లలో లీడ్ లో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

మే 14న కర్ణాటక సీఎల్పీ సమావేశం 

మే 14వ తేదీ ఆదివారం రోజు కర్ణాటక సీఎల్పీ సమావేశం కానుంది. గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు బెంగూళూరుకు రావాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. 

10.18 గంటలకు ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ :

కాంగ్రెస్ 110 స్థానాల్లో.. బీజేపీ 73 సీట్లలో.. జేడీఎస్ 24 చోట్ల, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ముందంజలో కుమారస్వామి, నిఖిల్ 

జేడీఎస్ అధినేత కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి స్వల్ప ఓట్లతో ముందంజలో ఉన్నారు.

బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలో కాంగ్రెస్ జోరు

సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా హవేరీలోని 6 నియోజకవర్గాల్లోని 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే లీడ్ లో ఉంది. అది కూడా సీఎం బొమ్మై నియోజకవర్గమైన షిగ్గావ్ కావడం గమనార్హం.

9 : 54 గంటలకు ఎలక్షన్ కమిషన్ ట్రెండ్ :

కాంగ్రెస్ 95 స్థానాల్లో.. బీజేపీ 61 సీట్లలో.. జేడీఎస్ 19 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ప్రియాంక గాంధీ పూజలు

క‌ర్నాట‌క అసెంబ్లీ ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. తాజా స‌మాచారం ప్రకారం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసింది. ఫ‌లితాలు వెలువడుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ షిమ్లాలోని హ‌నుమాన్ ఆల‌యంలో పూజ‌లు చేశారు. క‌ర్నాట‌క‌లో కౌంటింగ్ సంద‌ర్భంగా ఆమె హ‌నుమాన్ గుడిలో ప్రార్థన‌లు చేశారు. 

సంబరాల్లో కాంగ్రెస్ 

కాంగ్రెస్ పార్టీ 114 స్థానాల్లో  ఆధిక్యంలో కొనసాగుతుండటంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉన్నది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీ ఆఫీస్‌ వద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన కార్యకర్తలు.. డప్పు మోతలు, జై కాంగ్రెస్‌ నినాదాలతో  హోరెత్తిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే  ఎన్నికైన తర్వాత జరిగిన ఎన్నికలు జరగడం, అందులోనూ ఆయన సొంత రాష్ట్రం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించింది. 

9 : 40AM.. ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ 

కాంగ్రెస్ 74 సీట్లలో.. బీజేపీ 45 స్థానాల్లో.. జేడీఎస్ 16 చోట్ల.. గాలి జనార్థన్ రెడ్డి పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ ఒక స్థానంలో, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

9 : 30AM.. ఎవరు ముందంజ.. ఎవరు వెనకంజ

  • చెన్నపట్టణ స్థానంలో కుమారస్వామి (జేడీఎస్‌) వెనుకంజ
  • షిగ్గావ్‌ స్థానంలో బస్వరాజ్‌ బొమ్మై (బీజేపీ) ఆధిక్యం
  • వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య (కాంగ్రెస్‌) ఆధిక్యం
  • చెన్నపట్టణ స్థానంలో కుమారస్వామి (జేడీఎస్‌) వెనుకంజ
  • కనకపురా స్థానంలో డి.కె.శివకుమార్‌ (కాంగ్రెస్) ఆధిక్యం
  • హోళెనర్సీపూర్‌ నియోజకవర్గంలో రేవన్న (జేడీఎస్‌) ఆధిక్యం
  • గాంధీనగర్‌ స్థానంలో దినేష్‌ గుండూరావు (కాంగ్రెస్‌)ఆధిక్యం
  • గాలి జనార్దన్‌రెడ్డి దంపతులు ఆధిక్యం
  • గంగావతి స్థానంలో గాలి జనార్దన్‌రెడ్డి ఆధిక్యం
  • బళ్లారి పట్టణంలో గాలి లక్ష్మీ అరుణ ఆధిక్యం
  • బళ్లారి (ఎస్‌టీ) స్థానంలో శ్రీరాములు (బీజేపీ) వెనుకంజ
  • చిక్కబళ్లాపూర్‌ స్థానంలో సుధాకర్‌ (బీజేపీ) వెనుకంజ
  • హుబ్బళి ధార్వాడ్‌ సెంట్రల్‌లో జగదీశ్‌ షెట్టార్‌ ‍(కాంగ్రెస్‌) ఆధిక్యం
  • చిక్కమగళూరు స్థానంలో సి.టి.రవి (బీజేపీ) ఆధిక్యం
  • చిత్తాపూర్‌లో మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఆధిక్యం
  • శికారిపురలో యడియూరప్ప కుమారుడు విజయేంద్ర (బీజేపీ) ఆధిక్యం
  • హుబ్లీ ధర్వాడ్ లో మాజీ ఉపముఖ్యమంత్రి జగధీశ్ షెట్టర్ వెనుకంజలో ఉన్నారు

ముందంజలో లక్ష్మణ్‌ సవాదీ 

బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాదీ ముందంజలో ఉన్నారు. అథని స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ముందంజలో ఉన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్‌ సవాదీకి.. ఈసారి బీజేపీ టికెట్ఇవ్వలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. సవాదీ 2019 నుంచి 2021 వరకు బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. 

 9:26 గంటలకు ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్ :

కాంగ్రెస్ 57 సీట్లలో.. బీజేపీ 34 స్థానాల్లో.. జేడీఎస్ 7 చోట్ల, గాలి జనార్థన్ పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ ఒక స్థానంలో.. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

వెనుకంజలో 8 మంది మంత్రులు 

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు తొలి ట్రెండ్స్ అధికార బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి.  షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 8 మంది మంత్రులు మాత్రం వెనుకంజలో ఉన్నారు. ఆశోక్, సోమన్న, సుధాకర్, శ్రీరాములు, జార్క్ హోలి  వెనుకంజలో ఉన్నారు.

వెనుకంజలో కుమారస్వామి, నిఖిల్ 

కర్ణాటక ఓటర్లు జేడీఎస్ కు ఊహించని షాకిస్తున్నాయి. చెన్నపట్టణ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అధినేత హెచ్ డీ కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. రామనగర నుంచి బరిలో ఉన్న  ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి కూడా వెనుకంజలోనే ఉన్నారు. కుమారస్వామి సోదరుడు రేవణ్ణ మాత్రం ముందంజలో ఉన్నారు.

9 :16 గంటలకు ఎలక్షన్ కమిషన్ రిజల్ట్

కాంగ్రెస్ 38 స్థానాల్లో.. బీజేపీ 15 సీట్లలో.. జేడీఎస్ పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

  • హుబ్లీలో ముందంజలో ఉన్న కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై  
  • వరుణా నుంచి ముందంజలో సిద్దరామయ్య 
  • కననపురలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముందంజ
  • చెన్నపట్టణలో జేడీఎస్ అధినేత హెచ్ డీ కుమారస్వామి ముందంజ
  • రామనగర నుంచి వెనుకంజలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ 
  • బళ్లారి సిటీ నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న గాలి జనార్ధన్ రెడ్డి భార్య అరుణ
  • గంగావతి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న గాలి జనార్దన్​ రెడ్డి 

ఆధిక్యంలో గాలి జనార్ధన్ రెడ్డి, అతని భార్య

కర్ణాటక ఎన్నికల్లో ప్రత్యేక పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచిన మైనింగ్ టైకూన్ గాలి జనార్థన్ రెడ్డి, అతని భార్య అరుణ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో.. ఫుట్ బాల్ సింబల్ తో పోటీ చేశారు. బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గాలి అరుణ.. మొదటి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  గాలి జనార్దన్​ రెడ్డి గంగావతి నుంచి పోటీ చేయగా..  మొదటి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

  • ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్  కు గుడ్ న్యూస్ 
  • మ్యాజిక్  ఫిగర్ 113 మార్క్ ను కాంగ్రెస్ దాటేసింది.  
  • హుబ్లీలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముందంజలో ఉన్నారు.  
  • జేడీఎస్ అధినేత హెచ్ డీ కుమారస్వామి చన్నపట్టణంలో  ముందంజలో ఉన్నారు.  
  • కననపురలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్  ముందంజ

అధిక్యంలో కాంగ్రెస్ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది.  పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తొలుత  బీజేపీకి అధిక్యం రాగా,  మళ్లీ కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చింది. ఉదయం 9 గంటలకు  ఫస్ట్ ట్రెండ్స్ వచ్చ అవకాశం ఉంది.   

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, వయో వృద్ధుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 10వ తేదీ  బుధవారం పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 36 సెంటర్లను ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 224 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 73.19 శాతం రికార్డుస్థాయి పోలింగ్‌ నమోదయ్యింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి.

ఊరేగింపులు నిషేధం

ఓట్ల లెక్కింపు కేంద్రాల చుట్టూ వాహనాల పార్కింగ్‌పై పోలీసులు నిషేధాన్ని జారీ చేశారు. ఫలితాలు వెల్లడైన తర్వాత, కేంద్రాలకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఊరేగింపు, జాతర, బాణసంచా కాల్పులపైనా నిషేధం జారీలోకి రానుంది. మరోవైపు.. గెలుపు ఓటములపై జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. ఫలితాల అనంతరం ఎవరికీ మెజార్టీ రాకపోతే రిసార్టు రాజకీయాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

అందరిలోనూ టెన్షన్.. టెన్షన్ 

అధికారం తమకే దక్కుతుందని బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌లు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా.. పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఆధిక్యం రాకపోయినా ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్‌ బి) తమకు ఉందని బీజేపీ చెబుతోంది.