గెలిస్తే చరిత్రే! : 52 ఏళ్లలో పార్లమెంట్ గుమ్మంతొక్కని ఇండిపెండెంట్‌

ఏ పార్టీకి అటాచ్‌ కాకుం డా స్వయంశక్తితో చట్టసభల్లోకి అడుగు పెట్టడమనేది చాలా కష్టం . ఇందిరా గాంధీ హయాం మొదలయ్యాక…రాజకీయంగా ఎంత కెపాసిటీ ఉన్నప్పటికీ పార్టీ నీడలోనే ఎంపీలు కావడం మొదలైంది. కర్ణాటక రాష్ట్రంలో చివరిసారి గా 1967లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒకరు లోక్ సభలో ప్రవేశించారు. ఆ తర్వాత గడచిన 52 ఏళ్లలో మరో స్వతంత్ర అభ్యర్థి పార్లమెంట్‌ గుమ్మం తొక్కలేదు. స్వాతంత్య్రం వచ్చిన 10 ఏళ్లకు 1957లో బిజాపూర్‌ నార్త్‌ నుంచి సుగంధి మురుగప్ప సిద్దప్ప ఇండిపెండెంట్ గా గెలిచారు. అనంతరం మరో పదేళ్లకు 1967లో అప్పటి మైసూరు స్టేట్ లోని కెనరా నియోజకవర్గం నుంచి దినకర దేశాయ్‌ (డి.డి.దత్తాత్రేయ) స్వతంత్రుడిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. వీరితోనే ఇండిపెండెంట్‌ అభ్యర్థుల ఎన్నిక ఆఖరయ్యింది. 1951లో జరిగిన తొలి జనరల్‌ ఎలక్షన్‌ నుంచి 2014లో జరిగిన 16వ లోక్ సభ వరకు కర్ణాటకలో మొత్తం 2,337 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు.

వాళ్లలో పైన చెప్పుకున్న ఎస్‌.ఎం.సిద్దప్ప, డి.డి.దత్తాత్రేయ తప్ప ఎవరూ ఎంపీలు కాలేదు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లు జాతీయ పార్టీలపైనే మొగ్గు చూపడమే ఇందుకు కారణం. అదీగాక, కర్ణాటకలో ప్రాబల్య కులాలైన లింగాయత్ లు, ఒక్కలిగలు మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. వీరు కాకుండా, అహిందలు (మైనారి టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, దళితులు)కూడా వేర్వేరు పార్టీల తరఫున బరిలో ఉంటారు. వీరందరినీ కూడగట్టుకు న్నవాళ్లే విజేతలు కాగలుగుతున్నారు. జాతీయ పార్టీలు ఈ విషయంలో కులాల సమతుల్యతతో సీట్లను కేటాయించి , సాధ్యమైనన్ని సీట్లను కొల్లగొట్టడానికి ట్రై చేస్తుంటాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థులకు చోటు లేకుండా పోయింది. తాజాగా సీనియర్‌ నటులు సుమలత, ప్రకాశ్ రాజ్‌ ఇండిపెండెంట్లుగా నామినేషన్‌ వేయడంతో వీరి గెలుపుపై జనంలో ఆశలు మొదలయ్యాయి. సుమలత కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్‌ భార్య. కన్నడ సినిమాలో రెబెల్‌ స్టార్ గా గుర్తింపుపొందిన అంబరీశ్‌… 1994లో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి, మూడుసార్లు లోక్ సభకి, రెండు సార్లు అసెంబ్ లీకి ఎన్నికయ్యారు. యూపీఏ–1 ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అయితే, అంబరీశ్‌ మరణంతో మండ్య సీటుపై జనతాదళ్‌ (ఎస్‌) కన్నేసింది. ఆ స్థానంలో దేవెగౌడ తన కుటుంబంలో మూడో తరాన్ని రాజకీయ అరంగేట్రం జరపడానికి ఎంచుకున్నారు. కాం గ్రెస్ తో పొత్తులో భాగంగా మండ్య నియోజకవర్గాన్ని తమకు కేటాయించేలా వత్తిడి తెచ్చి సక్సెసయ్యారు. ఇక నేడో రేపో ముఖ్యమంత్రి కుమారస్వామి పెద్ద కొడుకు నిఖిల్‌ గౌడతో నామినేషన్‌ వేయించడానికి సిద్ధమయ్యారు.

ఈ దశలో సుమలత ఎదురు తిరిగారు. అంబరీశ్‌ చివరి రోజుల్లో… పోయినేడాది జరిగిన అసెంబ్ లీ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా కాం గ్రెస్‌ పార్టీ అవమానించింది. అంబరీశ్‌ చనిపోయిన తర్వాత కూడా ఆయనపట్ల సానుభూతి లేకుండా కుటుంబాన్ని పక్కన పెట్టేశారన్న కోపంతో సుమలత రగిలిపోయారు. మండ్య జిల్లాతో అంబరీశ్ కి గల అనుబంధాన్ని గుర్తు చేస్తూ… అక్కడి నుంచే లోక్ సభకి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుని నామినేషన్‌ వేసేశారు. దీంతో దేవెగౌడ తన మనవడి నామినేషన్‌ మహోత్సవాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక, ప్రకాశ్‌ రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ లోక్ సభా స్థానం నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్‌ వేశారు. గతంలో ఇది బెంగళూరు నార్త్‌, సౌత్‌ స్థా నాలుగా ఉండేది. 2009లో నియోజకవర్గాల డీలిమిటేషన్ తో బెంగళూరు సెంట్రల్ గా మారింది. ముస్లిం మైనారిటీలు, ఇతర ప్రాంతా ల నుంచి సెటిల్‌ అయినవారు ఈ నియోజకవర్గంలో ప్రాబల్యం చూపగలరు. మొత్తంగా 19 లక్షల పైచిలుకుగాగల ఓటర్లలో తమిళులు బాగా ఎక్కువగా అయిదున్నర లక్షల మంది ఉన్నారు. వీరి తర్వాత స్థా నంలో ముస్లిం లు నాలుగున్నర లక్షలు, క్రీస్టియన్లు రెండు లక్షలు ఉన్నట్లు  అంచనా. వీరు కాకుండా చిక్ పేట, గాంధీనగర్‌ సబర్బన్‌ ఏరియాల్లో మార్వాడీలు, జైన్ లు అధిక సంఖ్యలో ఉంటారు. ఇక్కడ వరుసగా 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున పి.సి.మోహన్‌ గెలుస్తున్నారు.

ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనూ … సి.వి.రామన్‌ నగర్‌, మహదేవ్ పుర ఎస్సీలకు రిజర్వయి ఉన్నాయి. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండింటితో పాటు రాజా జీనగర్‌ ఎమ్మెల్యే స్థా నాన్నికూడా బీజేపీయే గెలుచుకుంది. మిగతా అయిదు సీట్లలో కాం గ్రెస్‌ ఎమ్మెల్యే లున్నారు. పోయినేడాది జరిగిన ఎన్నికల్లోమాత్రం మొత్తం ఎనిమిది సీట్లనూ అంబరీశ్‌ ప్రచారంతో జనతాదళ్‌ (ఎస్‌) కైవసం చేసుకుంది. బెంగళూరు సెంట్రల్‌ లోక్ సభ స్థానం కిందకు వచ్చే శివాజీనగర్‌, ఉల్సూరు, గాంధీనగర్‌, శేషాద్రిపురం ప్రాంతాల్లో తమిళియన్లు గెలుపోటములు నిర్ణయించే స్థా యిలో ఉంటారు. సామాజికపరంగా చూసినప్పుడు  ఈ స్థా నంలో మిడిల్‌ క్లాస్‌ జనాలు అధికం. ఈ లెక్కలన్నీ చూసుకున్నాకనే… ప్రకాశ్‌ రాజ్‌ బెంగళూరు సెంట్రల్ ని ఎంచుకున్నారని స్పష్టమవుతోంది. తమిళ దర్శకుడు బాలచందర్‌ శిష్యుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్ కి తమిళ, తెలుగు సినీ ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ ఉంది. అటు సుమలత తన భర్త అంబరీశ్ కిగల పలుకుబడిని, ఆయన సొంత జిల్లాకి చేసిన సేవలను గుర్తు చేస్తూ, తన రాజకీయ అరంగేట్రానికి రెడీ అయ్యారు. ఇటు ప్రకాశ్ రాజ్‌ బెంగళూరు సెంట్రల్ లోగల ముస్లిం మైనారిటీలను, తమిళియన్లను దృష్టిలో పెట్టుకు ని బీజేపీకి సవాల్‌ విసురుతున్నారు. వీళ్లిద్దరూ గెలిచినట్లయితే… 52 ఏళ్ల చరిత్రను తిరగరాసి నవాళ్లవుతారు.