కర్ణాటక ఎన్నికలు.. బూత్ కమీటీ మీటింగ్‌లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు్న్న సందర్భంగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా కుష్టగి నియోజవర్గం లోని  మేనేదల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బూత్ కమీటీ మీటింగ్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలపై గ్రామంలోని పార్టీ కార్యకర్తలు, స్థానికులతో ఆయన చర్చించారు.

ఈ కార్యక్రమంలో   మేనేదల్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ధవళ్ బాషు, శాంత్ అప్ప, కనుల అప్ప, శేఖర్ అప్ప, కనక్ అప్ప, మహబూబు సబ్, మహబూబు సబ్ అరబ్, ఖాసీం సబ్, జిలాని సబ్, చెంద్రశేఖర్, ఎండీ రఫీ, కుంబర్ శేఖర్ అప్ప పాల్గొన్నారు.