Movie Ticket Price: సినిమా టికెట్ రూ.200కే పరిమితం.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ప్రొడ్యూస‌ర్లు,డిస్ట్రిబ్యూట‌ర్ల వ్య‌తిరేక‌త‌

Movie Ticket Price: సినిమా టికెట్ రూ.200కే పరిమితం.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ప్రొడ్యూస‌ర్లు,డిస్ట్రిబ్యూట‌ర్ల వ్య‌తిరేక‌త‌

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మార్చి 7, 2025న తన 16వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం సినీ లవర్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. మ‌ల్టీప్లెక్స్‌తో పాటు సింగిల్ స్క్రీన్స్‌లో ఒకే టికెట్ ధరను అమ‌లు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రూ.200 రూపాయ‌లు టికెట్ ధ‌ర‌గా నిర్ణ‌యించింది. ఖరీదైన టిక్కెట్లతో పాటు, ఎక్కువ రేట్లతో కూడిన ఫుడ్, మరియు పానీయాల ధరలు సినిమా ప్రేక్షకులపై మరింత భారం పడుతున్నాయని దృష్టికి వచ్చినట్లు ముఖ్యమంత్రి వివరించాడు. ఇందులో భాగంగా సినిమా వినోదాన్ని త‌క్కువ ఖ‌ర్చుకే అందించేందుకు సింగిల్ రేట్ సిస్ట‌మ్‌ను అమ‌లులోకి తీసుకురాబోతున్న‌ట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్ర‌క‌టించాడు.

అలాగే, ప్రభుత్వ ఆధ్వర్యంలో వర్క్ చేసే ఒక స్పెషల్ OTT యాప్ ను డెవలప్ చేయడానికి ఆదేశించారు. అంతేకాకుండా మైసూర్‌లో దాదాపు రూ.500 కోట్ల‌తో ఓ ఫిల్మ్ సిటీని నిర్మించ‌బోతున్న‌ట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించాడు. అందుకోసం దాదాపు 150 ఎక‌రాల భూమిని కేటాయించ‌బోతున్న‌ట్లు తెలిపాడు. 

అయితే, చాలా కాలంగా పెద్ద సినిమాలకు మొదటి వారాంతపు టిక్కెట్ల ధరలు రూ.500 కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల సాధారణ ప్రేక్షకులు సినిమా చూడటం మిస్ అవుతున్నారు. దీంతో క్రమ క్రమంగా ప్రేక్షకులు థియేటర్ వైపే చూడటం మానేసే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు తీసుకున్న టికెట్ ధరల తగ్గింపు నిర్ణయంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మ‌ల్టీప్లెక్స్ వ‌ర్గాల‌తో పాటు ప్రొడ్యూస‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్య‌తిరేఖిస్తున్నారు.