
పాఠశాల పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో వంట నూనె వాడకాన్ని10శాతం తగ్గించాలని కర్ణాటక ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల అలవర్చాలనే లక్ష్యంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారం అందించాలని సూచించింది. పాఠశాల వయస్సు పిల్లలలో ఊబకాయం, గుండె జబ్బుల గురించి పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో పొద్దుతిరుగుడు నూనె పరిమాణాన్ని తగ్గించాలని అధికారులకు పాఠశాల విద్య ,అక్షరాస్యత శాఖ కమిషనర్ కె.వి. త్రిలోక్ చంద్ర మార్గదర్శకాలను జారీ చేశారు.
మధ్యాహ్న భోజనంలో నూనెల వాడకం ఇలా
1నుంచి 5 తరగతిలోపు ప్రతి విద్యార్థికి నూనె వినియోగం 5 గ్రాములకు తగ్గించారు.
6, 7 తరగతుల విద్యార్థులకు 7.5 గ్రాములకు తగ్గించారు.
విద్యార్థులలో హెల్తీ ఫుడ్ ప్రోత్సహించేందుకు మార్గదర్శకాలు
- నూనె వాడకం తగ్గించి తాజాగా, పోషకాహారాన్ని అందించాలి.
- వంట నూనెల వాడకంపై పోషకాహార నిపుణుల సహాయంతో మధ్యాహ్న భోజన సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి.
- డీప్ ఫ్రైలకు బదులుగా స్ట్రీమింగ్, బాయిల్డ్ ఆహారాన్ని ప్రోత్సహించాలి
- ప్రాసెస్,జంక్ ఫుడ్ తినకుండా వాటివల్లకలిగే నష్టాలగురించి అవగాహన కల్పించాలి.
- ఆరోగ్య కరమైన ఆహారంపై క్విజ్ పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. విద్యార్థులకు బహుమతులు ఇవ్వాలి.