ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే కేసులేనన్న కర్ణాటక
బెంగళూరు: అద్దెకు ఉంటున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఓనర్లు ఒత్తిడి చేస్తున్నారంటూ వచ్చిన రిపోర్టులపై కర్ణాటక సర్కారు సీరియస్ అయ్యింది. అలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని, ఇది ప్రభుత్వ అధికారుల డ్యూటీలను అడ్డుకోవడమేనని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావెద్ అఖ్తర్ గురువారం అన్నారు. ఇలాంటి ఘటనలపై కర్నాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్స్ -2020 మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కమిషనర్, జాయింట్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఎస్పీలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
For More News..