
ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల బిల్లు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య మార్చిలో కర్ణాటక శాసనసభ, శాసన మండలిలో ఆమోదం పొందింది. రాష్ట్రంలో టెండర్లు,ప్రభుత్వం ప్రాజెక్టులకు అర్హత ఉన్న ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కోటా చేర్చేందుకు చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లు ప్రతిపాదించారు.
కర్ణాటకలో మతం ఆధారంగా టెండర్లలో రిజర్వేషన్లు ఇస్తోందని ప్రధాని మోదీ మోదీ ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ముస్లిం రిజర్వేషన్ బిల్ల కర్ణాటక ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. రాజ్యాంగంలో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎటువంటి నిబంధన లేనందున ఈ బిల్లు చట్ట విరుద్దమని బీజేపీ ఆరోపించింది.
►ALSO READ | టోక్యోలో సీఎం రేవంత్ కు భారత రాయబారి విందు
మార్చి 24న రాజ్యసభలో బీజేపీ ఎంపీ కిరణ్ రిజుజు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ముస్లింలకు కాంట్రాక్టులలో రిజర్వేషన్ కల్పించేందుకు కర్నాటక ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని ప్రకటించింది..ఇది రాజ్యాంగంపై దాడి అని ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోమని అన్నారు. కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ల బిల్లు మొదటినుంచి కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది. రాష్ట్రపతి ఆమోదం పొందితే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు కానుంది.