
- బెంగళూరులో జరిగిన ధర్నాలో పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల టైంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కర్నాటక ప్రభుత్వం విఫలమయిందని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల బీజేపీ సహ ఇన్ చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. బెంగళూరులోని ఫ్రీడం పార్క్ లో బుధవారం జరిగిన బీజేపీ డే-నైట్ ధర్నాలో పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కర్నాటక ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నదని ఆరోపించారు.
ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా మునిగిపోయిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రైతులు ఆత్మహత్యలుచేసుకుంటున్నా సర్కారుకు పట్టడం లేదని మండిపడ్డారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉందని వివరించారు. కాంగ్రెస్ అరాచక పాలనకు నిరసనగా 'మాది రామ రాజ్యం~మీది రావణ రాజ్యం' పేరుతో త్వరలో ఆందోళనలు చేపడతామన్నారు. దీనికి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు హాజరుకావాలని సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.