చెప్పారు.. చేశారు : కరెంట్ హామీతో.. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు

కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఇచ్చిన  ‘గృహ జ్యోతి’ హామీ పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని వాణిజ్య వినియోగదారులు పొందలేరు. 

రాష్ట్రంలో రెంట్ కు ఉంటున్న  వారితో పాటుగా గృహ వినియోగదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగాన్ని ఉపయోగిస్తే బిల్లు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని పొందాలనుకునే వారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'సేవా సింధు' పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.  

వినియోగదారులకు అందజేసే ఉచిత విద్యుత్‌ ఖర్చును విద్యుత్ సరఫరా కంపెనీలకు పరిహారంగా చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటక కాంగ్రెస్ చేసిన ఐదు ఎన్నికల వాగ్దానాలలో 'గృహ జ్యోతి' పథకం ఒకటి. ఇక మహిళలకు ఇచ్చిన  ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జూన్ 11 నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

Also Read :