వింత కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. పెళ్లికొడుకు చదువు సరిగా లేదని, కట్నం ఇవ్వలేదని, పెళ్లి ఏర్పాట్లు సరిగా లేదని పెళ్లిళ్లు కూడా ఆగిపోయాయి. అయితే కర్నాటకలో ఓ పెళ్లి కూతురు (Bride)తన వివాహాన్ని రద్దు చేసుకుంది. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కాసేపట్లో వరుడి(Groom)తో దాంపత్య జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయంలో అతని గొడవపడి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకంటే వరుడి తరపు వారు భోజనంలో స్వీట్స్ పెట్టలేదని ఈ సంచలన నిర్ణయం తీసుకుంది పెళ్లి కూతురు.అంతేకాదు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని వరుడు పెట్టిన ఉంగరాన్ని తీసి ఇచ్చేసింది.
హనగల్లు గ్రామానికి చెందిన యువతికి ... తుమకూరు నగరానికి చెందిన వ్యక్తితో మే 5 వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజుకి ముందు, వరుడి తరపు వారు వధువు కుటుంబం నుండి కట్నం డిమాండ్ చేశారు. బెంగళూరులో బంగారం, భూమి కావాలని పెళ్లికొడుకు కుటుంబీకులు డిమాండ్ చేశారని ఆరోపించింది. త్వరలో పెళ్లి చేసుకోబోయే జంట ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని ఫిక్స్ చేసారు. పెళ్లిలో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా పెళ్లికొడుకు తరపు వారు భోజనంలో స్వీట్స్ పెట్టలేదని తెలిసింది. ఈ ఘటనతో వధువు కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. వరుడు తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఉంగరాన్ని తీసేసింది. ఈ ఘటనతో వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.