రాహుల్ గాంధీపై పిల్.. కొట్టేసిన కర్నాటక హైకోర్టు

రాహుల్ గాంధీపై పిల్.. కొట్టేసిన కర్నాటక హైకోర్టు
  • పిటిషనర్​కు రూ.25 వేల జరిమానా

బెంగళూరు: భారతీయ మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు కాంగ్రెస్ ఎంపీరాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ దాఖలైన పిల్​ను కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళలను అత్యాచారం చేసి వీడియోను తీశారంటూ రాహుల్ ఆరోపణలు చేశారని ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ హైకోర్టులో పిల్ వేసింది.

దీనిని సోమవారం చీఫ్ జస్టిస్ ఎన్ వి. అంజారియా, జస్టిస్ కె. అరవింద్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాహుల్ గాంధీ బహిరంగ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఆరోపణలపై స్పందించాల్సిందిగా ఆయనకు నోటీసులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం..ఈ పిటిషన్ విచారణకు అర్హత లేనిదిగా తేలుస్తూ దానిని కొట్టివేసింది. పిటిషనర్​కు రూ.25 వేల జరిమానా విధించింది.