ఫ్రెంచ్ ప్రైస్ తినొద్దు అన్నందుకు భర్తపై కేసు : చివాట్లు పెట్టిన హైకోర్టు

అతనిపై ఆరోపణలు చాలా చిన్నవి..తక్షణమే అతన్ని వదిలేయండి..అతని పనులు చేసుకోనివ్వండి..అని ఓ భర్తపై భార్యకేసులో కర్ణాటక హైకోర్టు ఆదే శాలు జారీ చేసింది.. ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వలేదని భర్తపై కోర్టుకెక్కిన భార్య పిటిషన్ ను విచారించిన కర్ణాటక హైకోర్టు.. భర్తకు ఉపశమనం కలిగిస్తూ ఆదేశించింది.  

ప్రసవం తర్వాత తనను మాంసం.. ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వడం లేదని భార్త, అతని తల్లిదండ్రులపై  భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 498A (క్రూరత్వం) కింద కేసు నమోదు చేశారు.ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది.. గురువారం ఆగస్టు 22, 2024న విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆ భర్తకు ఉపశమనం లభించింది. 

ఇలాంటిదే మరో స్టోరీ.. భరణం కోసం 6లక్షలు డిమాండ్ మహిళ.. చీవాట్లు పెట్టిన హైకోర్టు

ఇటీవల కర్ణాటక హైకోర్టులో భర్తనుంచి భరణంగా రూ. 6లక్షల 16వేల 300 డిమాండ్ చేసిన మహిళా క్లయింట్ డిమాండ్ గురించి న్యాయవాదిని మహిళా జడ్జి ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న భర్త నుంచి మహిళ చేసిన అసమంజసమైన భరణం డిమాండ్ కోసం న్యాయవాదిపై మహిళా జడ్జి ర్యాప్ చేయడం వీడియోలో చూపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఆమె భర్తపై మహిళ చేసిన అభియోగాలు చాలా చిన్నవని  హైకోర్టు విచారణను నిలిపివేసింది. అతనిపై దర్యాప్తుకు అనుమతించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని తెలిపింది. అంతేకాదు..అధికారులకు సహకరిస్తానని కోర్టుకు హామీ ఇవ్వడంతో  ఆ వ్యక్తికి అమెరికాకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. అతని తల్లిదండ్రులపై విచారణను ఇంతకుముందే నిలిపివేసింది.