అభిమాని హత్య కేసులో దర్శన్​కు బెయిల్

అభిమాని హత్య కేసులో దర్శన్​కు బెయిల్

బెంగళూరు: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నటుడు దర్శన్​కు కర్నాటక హైకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

వెన్నునొప్పి, కిడ్నీ సమస్యలతో పాటు పాదాల తిమ్మిరితో దర్శన్ బాధపడుతున్నారని, మైసూర్‌‌‌‌లోని ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని నటుడి అడ్వొకేట్​ సీవీ నగేష్ పిటిషన్​ దాఖలు చేశారు. 

బళ్లారి సెంట్రల్ జైలు డాక్టర్లు, బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగాధిపతి నుంచి మెడికల్​ రిపోర్ట్​లను సీల్డ్ కవర్‌‌‌‌లో సమర్పించారు. బుధవారం వివరణాత్మక వాదనలు విన్న కర్నాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి దర్శన్​కు బెయిల్​మంజూరు చేశారు.