అమాయక విద్యార్థుల్లో విభజన ఏర్పడే ప్రమాదం

చెన్నై: కర్నాటకలో వివాదాస్పదంగా మారిన హిజాబ్ ఘటనలపై విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ స్పందించారు. అశాంతిని రెచ్చగొడుతున్నారన్న కమల్.. ఈ ఘటనల వల్ల అమాయకులైన విద్యార్థుల్లో మతపరమైన విభజనలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడు ప్రభుత్వం మరింత అప్రమత్తతతో ఉండాలని హెచ్చరించారు. ‘పొరుగు రాష్ట్రం కర్నాటకలో జరుగుతున్న సంఘటనలపై మనం అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఘటనలు తమిళనాడులో జరగకుండా కాకుండా జాగ్రత్త పడాలి. ఈ సమయంలో ప్రగతిశీల శక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని కమల్ ట్వీట్ చేశారు. 

కాగా, కర్నాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రెండు వర్గాల మధ్య గొడవలు తీవ్రమవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది. విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విట్టర్ వేదికగా కోరారు. ఉద్రిక్త పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మూడురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టు విచారణ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

జట్టుతో కలసి రఫ్ఫాడిస్తానంటున్న బిగ్ బీ

కేర‌ళ ట్రెక్క‌ర్‌ను ర‌క్షించిన ఆర్మీ

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలు