కర్ణాటకలో పెరిగిన డీజిల్ , పెట్రోల్ ధరలు

కర్ణాటకలో పెరిగిన డీజిల్ , పెట్రోల్ ధరలు

కర్ణాటకలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల పై రూ.3, లీటర్ డీజిల్ పై రూ. 3.02  పెరిగింది. శనివారం (జూన్ 15)  కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చే సిన నోటిఫికేషన్ ప్రకారం..కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (కెఎస్‌టి) పెట్రోల్‌పై 25.92 శాతం నుంచి 29.84 శాతం, డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతం పెంచింది. 

లీటర్ పెట్రోల్‌పై రూ.3, లీటర్ డీజిల్‌పై రూ.3.02 పెరిగింది. దీంతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86కు, డీజిల్ ధర రూ.88.94కు చేరింది. ఈ పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. పెరిగిన ధరల కారణంగా ఏడాదికి అదనంగా రూ.2,500 నుంచి రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరనుంది.