కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చిక్మగళూరు వద్ద రైల్వే ట్రాక్ పక్కన ధర్మేగౌడ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలిలో సూసైడ్ నోట్ కూడా ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా అది ధర్మెగౌడ అని తేల్చారు. డెడ్ బాడీ పక్కనే సూసైడ్ లెటర్ ని కూడా ఉండటంతో ఆత్మహత్య అని నిర్ధారించారు.
ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో జరిగిన హైడ్రామాలో కాంగ్రెస్ సభ్యులు ధర్మేగౌడను సీటులో నుంచి లాగేశారు. ఈ ఘటనతో డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ తీవ్ర మనస్తానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ధర్మేగౌడ సోమవారం సాయంత్రం ఒంటరిగా కారులో వెళ్లారు. తెల్లారేసరికి విగత జీవిలా మారారు. జేడీఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ధర్మేగౌడ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ధర్మేగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవేగౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్య వార్త విని షాకు గురయ్యానన్నారు. ఆయన మంచి వ్యక్తి అని ..ఆయన లేకపోవడం రాష్ట్రానికి తీరని లోటన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి కర్ణాటకకు తీరని లోటు అన్నారు.
Karnataka: Body of SL Dharmegowda, Deputy Speaker of State Legislative Council was found on a railway track near Kadur in Chikkamagaluru. A suicide note has been recovered.
— ANI (@ANI) December 29, 2020
కర్ణాటక మండలి డిప్యూటి ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య
- దేశం
- December 29, 2020
లేటెస్ట్
- బీఆర్ఎస్ అవినీతిని ప్రభుత్వం బయటకు తీస్తోంది : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
- ఘనంగా గోదా రంగనాథుల కల్యాణం
- షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో ‘ఖని’కి కొత్తరూపు : ఎంఎస్ రాజ్ఠాకూర్
- కబ్జాకోరులకు కేటీఆర్ వంత పడుతున్నడు : ఆది శ్రీనివాస్
- ప్రభుత్వ పథకాల అమలు స్పీడప్ చేయాలి
- గ్రామీణ ప్రాంత అభివృద్ధే లక్ష్యం
- కొలువుదీరిన జములమ్మ ఆలయ కమిటీ
- పాలమూరు రుణం తీర్చుకునేందుకే.. విద్యా నిధి తీసుకొచ్చా : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- వడ్డెరులకు రాజకీయ గుర్తింపు పెరగాలి : చైర్మన్ జెరిపేట జైపాల్
- లాయర్లు ఉత్సాహంగా పనిచేయాలి : హై కోర్టు జడ్జి విజయ్ సేన్ రెడ్డి
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన