కర్ణాటక ప్రభుత్వం ఫుడ్ అడల్ట్రేషన్‌పై ఉక్కుపాదం మోపింది. హానికరమైన స్ట్రీట్ ఫుడ్ ని ఒక్కొక్కటిగా బ్యాన్ చేసుకుంటూ వస్తోంది. గోల్గప్పల అనే పిలవబడే స్ట్రీట్ ఫుడ్ పానీపూరీపై కర్నాటక దృష్టి పెట్టింది. గతకొన్ని నెలల క్రితం ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని గోబి ఫ్రైని బ్యాన్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక రాష్ట్ర ఆహార భద్రతా శాఖ ప్రజా ఆరోగ్యం పట్ల స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తోంది. ఆరోగ్యానికి హానికలిగించే ఏ ఆహార పదార్థాలైనా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో అక్కడ పానీపూరీ కూడా బ్యాన్ చేస్తారని స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పానీపూరీ తయారీలో కల్తీ జరుగుతుందని వస్తున్న ఫిర్యాదుల కారణంగా.. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ బహిరంగ ప్రదేశాలు, మాల్స్ లో అమ్మే వంటకాలు క్వాలిటీ చెక్ చేయాలని ర్యాపిడ్ ఫుడ్ టెస్టింగ్ కిట్‌లను ఏర్పాటు చేసింది. క్వాలిటీ లేని ఆహారాన్ని గుర్తించే విధంగా తనిఖీలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. పానీపూరీ బండ్లపై ఆహార శాఖ నిఘా పెట్టింది. బెంగళూరులోని పలు ప్రాంతాల్లోని పానీపూరీ శాంపిల్స్ ను రాండమ్‌గా సేకరించి పరీక్షిస్తున్నారు. బెంగళూరు సహా కర్ణాటక వ్యాప్తంగా 200కి పైగా పానీపూరీ సెంటర్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.
ALSO READ : Diwali 2024 : నోరూరించే దీపావళి స్వీట్స్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
పూరీ, అందులో వాడే మసాలాలు ఎలా తయారు చేస్తారు. పానీపూరీ జనాల హెల్త్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలించడానికి ఆహార శాఖ ప్రయత్నిస్తోంది. గత రెండు రోజులుగా పానీపూరీ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. దాని టేస్ట్ పెంచడానికి యూరియా, హార్పిక్ వంటి ప్రమాదకరమైన పదార్ధాలను కూడా వాడుతున్నారని అనేక ఆరోపణలు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఆరోపణలు రావడంతో కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం నిఘా పెంచి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. త్వరలో పానీపూరీ బ్యాన్ అవుతుందేమో అని అనుమానాలు అక్కడి ప్రజల్లో వ్యక్తమౌతున్నాయి.