
బెంగళూరు: తాను హనీట్రాప్‌కు గురైంది నిజమేనని కర్నాటక కోఆపరేషన్ మినిస్టర్ కేఎన్ రాజన్న వెల్లడించారు. తాను మాత్రమే కాదని.. హోం మినిస్టర్ పరమేశ్వర సహా అన్ని పార్టీలకు చెందిన 48 మంది లీడర్లు హనీట్రాప్ బాధితులేనని వెల్లడించారు. కర్నాటక అసెంబ్లీలో గురువారం రాజన్న మాట్లాడారు. "కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సహా అనేక మంది పొలిటికల్ లీడర్లు హనీట్రాప్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి " అని పేర్కొన్నారు.
మంత్రి కామెంట్లపై సభలో దుమారం రేగింది. దీనిపై దర్యాప్తు జరిపించాలని అధికార, ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. హనీట్రాప్ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.