తల్లిదండ్రులను వదిలేస్తే..ఆస్తి బదిలీ రద్దు

తల్లిదండ్రులను వదిలేస్తే..ఆస్తి బదిలీ రద్దు
  •  సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ కింద చర్యలు: కర్నాటక మంత్రి

బెంగళూరు: ఆస్తులన్నీ తమ పేర్లమీదికి చేయించుకున్నాక తల్లిదండ్రులను ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో వదిలేయడంపై కర్నాటక మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేసిన కొడుకులకు ఆస్తి బదిలీలను రద్దు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రుల హెచ్​వోడీలు ఫిర్యాదులు చేయాలని, రెవెన్యూ అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. బెలగావి ఇన్​స్టిట్యూట్ ఆఫ్​మెడికల్ సైన్సెస్ లో 150 మంది వృద్ధులను విడిచిపెట్టినట్లు ఇటీవల కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగానూ ఇలాంటి 100 కేసులు ఫైల్ అయ్యాయి. వీరంతా తమ ఆస్తులను పిల్లల పేరుమీదికి బదిలీ చేసిన తర్వాత వదిలేయబడ్డారు. ఈ విషయం తెలిసి మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో సమావేశమై బాధ్యులైన పిల్లలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2007 ప్రకారం కేసులు పెట్టాలని సూచించారు.