Karnataka : దేవీరమ్మ జాతరలో తొక్కిసలాట.. కొండపై నుంచి జారిపడ్డ భక్తులు

Karnataka : దేవీరమ్మ జాతరలో తొక్కిసలాట.. కొండపై నుంచి జారిపడ్డ భక్తులు

కర్ణాటకలోని చిక్ మగళూరు దేవీరమ్మ కొండపై విషాదం చోటుచేసుకుంది.  3 వేల  అడుగుల ఎత్తులో మాణిక్యధార కొండపై ఉన్న  బిండిగ దేవీరమ్మ జాతరకు  భక్తులు పోటెత్తారు.  నవంబర్ 1న ఉదయం నుంచి వేలాది మంది భక్తులు కొండపైకి క్యూ కట్టారు. 

అక్టోబర్ 31న రాత్రి కురిసిన వర్షానికి తోడు  పరిమితికి మించి భక్తులు కొండపైకి రావడంతో తొక్కిసలాట జరిగింది.  దీంతో వందలాది భక్తులు కొండ నుంచి కిందికి జారి పడిపోయారు.  పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళ్ల సహాయంతో  సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలైన ఓ మహిళను ఆస్పత్రికి తరలించారు. 

Also Read :- ప్రధానిమోదీ ఆర్థిక సలహాదారు బిబేక్ దెబ్రాయ్ మృతి

చిక్కమగళూరులోని చంద్ర ద్రోణ కొండ శ్రేణిలో ని ఈ ఆలయం దీపావళి సమయంలో మాత్రమే తెరిచి ఉంటుంది, నిరంతర వర్షపాతం ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో ప్రజల ఆలయాన్ని దర్శించుకుంటారు. కర్నాటక నలుమూలల నుండి వచ్చిన భక్తులు బిండిగ దేవీరమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.