Viral news: బాలుడి చెంప గాయాన్ని ఫెవిక్విక్తో అతికించిన నర్సు..నెట్టింట వైరల్

Viral news: బాలుడి చెంప గాయాన్ని ఫెవిక్విక్తో అతికించిన నర్సు..నెట్టింట వైరల్

ఈ నర్సుకు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారో గానే ..ఈవిడగారి వైద్యానికి పేషెంట్లు, వారి బంధువులు భయపడి చచ్చిపోయారు. కర్ణాటకలో బాలుడి చెంపకు అయినా గాయా నికి ఓ ప్రభుత్వాస్పత్రి నర్సు చేసిన ట్రీట్ మెంట్ చూసి.. అందరూ బిత్తరపోయారు. ఇదేం వైద్యం అని ప్రశ్నిస్తే ఆ నర్సు చెప్పిన సమాధానం విని షాక్ తిన్నారు.. కోలుకున్న తర్వాత ఆవిడగారి వింత వైద్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. 

గాయమైందని ఆస్పత్రికి వస్తే..ఓ నర్సు కుట్లు వేయాల్సిన చోట ఫెవిక్విక్ పెట్టి అతుకుపెట్టింది. దిగ్భాంతికరమైన సంఘటన కర్ణాటకలోని  ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. నర్సు సంగతి ఇటు ఉంచితే.. ఇంత నిర్లక్ష్యం, అవివేకమైన పనులు చేసిన నర్సుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆరోగ్య శాఖ కూడా ఆమెను తాత్కాలికంగా మరోచోటికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇది గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై ఆగ్రహాన్ని,ఆందోళనలను రేకెత్తించింది.

కర్ణాటకలోని హనగల్ తాలూకాలోని అడూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఈ సంఘటన జరిగింది. అడూర్ ప్రాంతానికి చెందిన గురు కిషన్ అనే ఓ బాలుడికి చెంపకు గాయమై తీవ్ర రక్తస్రావం అయింది.  చెంప దాదాపు రెండుగా చీలింది. గురుకిషన్ తల్లిదండ్రులు అతడిని చికిత్స్ కోసం పీహెచ్ సీ కి తీసుకెళ్లారు. అయితే  అక్కడు నర్సు చేసిన పనికి వారు నిర్ఘాంత పోయారు. 

ALSO READ | అక్రమంగా వెళితే అరెస్ట్ చేయరా ఏంటీ.. సంకెళ్లు వేస్తారు : కేంద్ర మంత్రి జయశంకర్

గురుకిషన్ చీలిన చెంపను కుట్లు వేయాల్సి ఉండగా.. ఆ పీహెచ్ సీలో పనిచేసే నర్సు చెక్క అతుకు పెట్టే ఫెవిక్విక్ ను గాయంపై ఉంచి బ్యాండేజ్ వేసింది. ఇదేంటని గురుకిషన్ పేరెంట్స్ అడిగితే ఆమె చెప్పిన సమాధానం విని షాక్ తిన్నారు. 

గత కొన్నేళ్లుగా గాయమైన వారికి చీలిన శరీర భాగాలను అతుకుపెట్టేందుకు ఫెవిక్విక్ వాడుతున్నానని,ఫెవిక్విక్ పనిచేయకపోతే మరో రకమైన చికిత్స ను సూచించేవాళ్లం అని నర్స్ చెప్పడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

శరీర భాగాలను అతుకుపెట్టేందుకు చెక్కను అతుకు పెట్టే ఫెవిక్విక్ ఉపయోగించడం ఏందీ అని పరేషాన్ అయిన బాలుడు గురు కిషన్ పేరెంట్స్ ఆందోళను చెందుతూ.. ఆరోగ్య శాఖ పై అధికారికి కంప్లెయింట్ చేశారు. నర్సు చెప్పిన వింత సమాధానాన్ని రికార్డు చేసి జిల్లా ఆరోగ్య శాఖ అధికారికి పంపించి ఫిర్యాదు చేశారు. అయితే ఆరోగ్య శాఖ పై అధికారులు కూడా ఆ నర్సుపై మందలింపు చర్యగా ఇంకోచోటికి బదిలి చేయడం ఇక్కడ చర్చనీయాంశమైంది.