
శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు కన్నడిగులు తమ ఇంటి ఆడపడుచుగా భావించే భ్రమరాంభదేవికి వందలాది కిలో మీటర్లు పాదయాత్ర చేసుకుంటూ పుట్టింటి సారెను సమర్పించేందుకు భక్తులు మల్లన్న సన్నధికి చేరుకుంటారు. మంటుడెంటలను లెక్కచేయకుండా హరహర హహాదేవ శంభోశంకర మహాదేవా.. ఓంనమ: శ్శివాయ అనే నామస్మరణతో శ్రీశైలం అటవీ ప్రాంతం మారుమోగుతుంది. ప్రతి ఏడాది ఉగాది ఉత్సవాలకు శ్రీశైలేషుని ధర్మపత్ని భ్రమరాంభికకు కన్నడిగులు పాదయాత్రగా పుట్టింటి సారెను (పసుపు కుంకుమ, గాజులు, వస్త్రాలు, వడిబియ్యం) ను శతాబ్దాల కాలంగా పాదయాత్రగా వచ్చి సమర్పించుఉంటారు.
Also Read:-శ్రీశైలంలో విపరీతమైన రద్దీ : శివయ్య దర్శనానికి 6 గంటల సమయం
ఉగాది రోజుకు ముందుగానే కన్నడిగులు శ్రీశైలానికి చేరుకొని అమ్మవారికి పుట్టింటి సారే సమర్పించి తమ భక్తిపారవశ్వాన్ని చాటుకుంటారు. అమ్మవారికి సారెతో పాటు మిరియాల చూర్ణాన్ని (మిరియాలపట్టు) నుదుటన ఉంచేందుకు తీసుకొస్తారు. మాఘమాసంలో అంటే గత నెలలో శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు శ్రీశైలం క్షేత్రానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆ సమయంలో భక్తుల రద్దీతో అమ్మవారికి తలపోటు వచ్చిందేమేనన్న భావనతో తమ అడపడుచుకు ఆ కష్టాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో మిరియాల పట్టును తీసుకురావడం సంప్రదాయంగా వస్తోంది. ఎంతో విశేష ప్రాశస్త్యం కలిగిన కన్నడిగుల పాదయాత్ర శ్రీశైల క్షేత్ర ఆవిర్భావం నుంచే కొనసాగుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.