Milk Rates: నందిని పాల ధరలు పెరిగాయ్..లీటరుపై ఎంతంటే?

Milk Rates: నందిని పాల ధరలు పెరిగాయ్..లీటరుపై ఎంతంటే?

నందిని పాల వినియోగదారులకు షాక్..కర్ణాటక ప్రభుత్వం నందిని పాల ధరలు పెంచింది. లీటర్ పై 4 రూపాయలు పెంచాలని  నిర్ణయించింది.  ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం రూ.44 లు ఉన్న ఒక లీటరు నందిని పాల ప్యాకెట్ ధర రూ.48కి చేరింది.నందిని పెరుగు ధర కూడా కిలోగ్రాముకు రూ.4 పెరిగింది.

గత 2024 జూన్ లో నందిని పాల ధరలను పెంచారు. అప్పుడు లీటరుపై రూ.2 పెంచింది. అంతకు ముందు జులై 2023లో నందిని పాల ధరలను లీటరుపై రూ.3 పెంచింది. ఇప్పుడే ఏకంగా రూ.4 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడం ప్రజలపై మరింత భారం పడనుంది. 

పెరుగుతున్న ఖర్చులు భర్తీ చేయడానికి ధరలు పెంచాలని రైతులు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి కేఎన్ రాజప్ప చెప్పారు. పాల ధరలను పెంచాలనే డిమాండ్ లీటరుకు 5 రూపాలు పెంచాలని డిమాండ్ ఉండగా.. ప్రభుత్వం పాల ధరలను రూ.4 పెంచాలని నిర్ణయించిందన్నారు. కాగా పెరిగిన ధరలు ఏప్రిల్ 1నుంచి అమలులోకి రానున్నాయి.