విషాదం: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

విషాదం: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

విధులు నిర్వహిస్తూ ఓ కండక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన  సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక బస్టాండ్ లో చోటుచేసుకుంది. జనవరి 31వ తేదీ బుధవారం సదాశివపేట పట్టణంలోని స్థానిక బస్టాండ్ లో హైదరాబాదు నుండి బీదర్ వైపు వెళ్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ కు  ఒకసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.

 వెంటనే కండక్టర్ ను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పపత్రిలో చికిత్స పొందుతూ కండక్టర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కండక్టర్ డెడ్ బాడీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.