
దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న మహిళపై గ్యాంగ్ రేప్..కదులుతున్న బస్సులో దారుణం..నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి కన్న బిడ్డలముందే ఆమెపై మృగాల్లా పైశాచిక దాడి..కర్ణాటకలో ఓ మహిళపై బస్సు డ్రైవర్ , కండక్టర్ గ్యాంగ్ రేప్ కు పాల్పడిన దారుణ, షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మహిళపై జరిగిన ఈ దారుణాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో బయటికి వచ్చింది.
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సులో మహిళపై ఆమె ఇద్దరు కుమారుల ముందే సామూహిక అత్యాచారం పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
విజయనగరం జిల్లాకు చెందిన బాధితురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి మార్చి 31న దావణగెరె జిల్లాలోని హరపనహళ్లిలో ప్రసిద్ధ మత కేంద్రమైన ఉచ్చంగిదుర్గ ఆలయానికి దైవదర్శనం కోసం వచ్చింది. అనంతరం ఉచ్చంగిదుర్గ నుంచి దావణగెరె వైపు చివరి బస్సు ఎక్కింది. దావణగెరె సమీపంలోని చన్నపుర శివార్లలో బస్సు ముఠా డ్రైవర్, కండక్టర్,మరో వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశారు. బస్సులో ఉన్న మిగతా ప్రయాణీకులందరూ దిగిన తర్వాత నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు.
డ్రైవర్ బస్సును చన్నపుర సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, పిల్లల నోటిలో గుడ్డను పెట్టి గొంతు బిగించాడని, వారి చేతులను కూడా కట్టేసి వారి ముందే తల్లిపై సామూహిక అత్యాచారం చేశారు. పొలాల్లో ఉన్న రైతులు అటుగా వెళ్తున్నవారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను రక్షించారు.ముగ్గురు నిందితులు డ్రైవర్ ప్రకాష్ మడివలర, కండక్టర్ సురేష్, హెల్పర్ రాజశేఖర్ లను పట్టుకుని అరసికెరె పోలీసులకు అప్పగించారు.
నిందితుల్లో ఒకరిపై గతంలో ఏడు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే స్థానిక పోలీసులు కేసును నీరుగార్చడానికి ప్రయత్నించారని, విజయనగర ఎస్పీ శ్రీహరి బాబు బిఎల్ జోక్యం చేసుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారని తెలుస్తోంది.