వీడు మామూలోడు కాదు... అత్తింటికే కన్నం వేసిన అల్లుడు..

వీడు మామూలోడు కాదు... అత్తింటికే కన్నం వేసిన అల్లుడు..

అత్తింట్లో దొంగతనానికి పాల్పడ్డ అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మీనప్ప రేవన సిద్ధప్ప అనే వ్యక్తి తన అత్తింట్లో 11లక్షలు చోరీ చేశాడు. అత్త కంప్లైంట్ తో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు అల్లుడు.  

ఇంటి స్థలం కొనేందుకు సిద్ధమ్మ రూ. 11లక్షలు ఇనుప పెట్టెలో  దాచుకుంది.  ఇనుప పెట్టె పగలగొట్టి అందులో ఉన్న రూ.11లక్షలను ఎత్తుకెళ్లాడు అల్లుడు మీనప్ప రేవన సిద్ధప్ప. సిద్ధమ్మ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అల్లుడు సిద్ధప్పను అదుపులోకి తీసుకున్నారు. రూ. 9 లక్షల రికవరీ చేశారు. మరో నిందితుడు అనిల్ పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.