బీదర్(కర్నాటక): సైంటిఫిక్ పేలోడ్‌తో కూడిన బెలూన్ పడిపోవడంతో కర్నాటకలోని బీదర్ జిల్లా వాసులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) ఈ బెలూన్ను లాంచ్ చేసిందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎలక్ట్రిక్, మేగ్నటిక్ ఫీల్డ్ ను స్టడీ చేయడానికి టీఐఎఫ్ఆర్ శుక్రవారం రాత్రి పది గంటలకు ఈ బెలూన్ ను లాంచ్ చేసింది. ఈ క్రమంలోనే హుమ్నాబాద్ తాలూకా జలసింగి గ్రామంలో శనివారం ఈ బెలూన్ పడిపోయింది. భారీ శబ్దాన్ని విన్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. దాని చుట్టుముట్టి ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు. శాటిలైట్ చెత్తేమోనని అనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని అది సైంటిఫిక్ పేలోడ్ తో కూడిన బెలూన్ అని తేల్చారు.