కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ

కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ

కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్నాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కేసులను కంట్రోల్ చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల (జనవరి -19) వరకు  వీకెండ్ కర్ఫ్యూ  అమలు చేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి అశోక తెలిపారు.  మిగతా రోజుల్లో ఇప్పటికే అమలవుతున్న నైట్ కర్ఫ్యూ కంటిన్యూ అవుతుందన్నారు. ఎవరైనా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే  కఠిన చర్యలు తప్పవన్నారు.

రాబోయే రెండు వారాల పాటు బెంగళూరులోని 1 నుంచి 9 తరగతి స్కూల్స్‌ మూసివేస్తున్నట్టు తెలిపారు మంత్రి అశోక.  అంతేకాదు.. థియేటర్లు, మాల్స్, పబ్‌లు, బార్‌లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది కర్నాటక ప్రభుత్వం. పెళ్లిళ్ల విషయంలోనూ కొత్త రూల్స్ విధించింది. మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసింది.

 

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ పోలీసులు పింక్ డ్రెస్ వేసుకోవాలి