వడోదరా: బ్యాటింగ్‌లో చెలరేగిన కర్నాటక ఐదోసారి విజయ్ హజారే ట్రోఫీని సొంతం చేసుకుంది. రవిచంద్రన్ స్మారన్ (101), అభినవ్ మనోహర్ (79), క్రిష్ణన్ శ్రీజిత్ (78) దుమ్మురేపడంతో.. శనివారం జరిగిన ఫైనల్లో కర్నాటక 36 రన్స్ తేడాతో విదర్భపై గెలిచింది. టాస్ ఓడిన కర్నాటక 50 ఓవర్లలో 348/6 స్కోరు చేసింది. దేవదత్ పడిక్కల్ (8), కేవీ అనీష్ (21) విఫలమైనా.. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32) ఫర్వాలేదనిపించాడు. 67 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన దశలో స్మారన్, శ్రీజిత్‌తో నాలుగో వికెట్‌కు 160, మనోహర్‌తో ఐదో వికెట్‌కు 106 రన్స్ జత చేశాడు.
దర్శన్ నాల్కండే, నచికేత్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్‌లో విదర్భ 48.2 ఓవర్లలో 312 రన్స్‌కే ఆలౌటైంది. ధ్రువ్ షోరే (110), హర్ష్ దూబే (63) రాణించినా మిగతా వారు నిరాశపర్చారు. కెప్టెన్ కరుణ్ నాయర్ (27), జితేశ్ శర్మ (34) పోరాడారు. వాసుకి కౌశిక్, ప్రసిధ్ కృష్ణ, అభిలాష్ షెట్టి తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. స్మారన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కరుణ్ నాయర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.