బెంగళూరు: కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ వెంటనే ఎత్తేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు మళ్లీ పెరిగితే లేదా ఆస్పత్రుల్లో చేరే కొవిడ్ పేషెంట్ల సంఖ్య ఎక్కువైతే తిరిగి వీకెండ్ కర్ఫ్యూను విధిస్తామని కర్నాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. కాగా, కర్నాటకలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 48 వేల మందికి పైగా వైరస్ బారిన పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కర్నాటకలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ రేటు 18.48 శాతంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. ఇకపోతే, బెంగళూరులో కొత్తగా 30 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 8 మంది చనిపోయారు.
The weekend curfew will be lifted with immediate effect. If the number of cases (hospital admission ) increases, we will bring back the weekend curfew: R Ashok, Karnataka Revenue Minister
— ANI (@ANI) January 21, 2022
(File photo) pic.twitter.com/P6PgqUDTFB
మరిన్ని వార్తల కోసం: