కండక్టర్ తో మహిళ గొడవ.. ఐడీకార్డుపై చెలరేగిన వాగ్వాదం

  కండక్టర్ తో మహిళ గొడవ.. ఐడీకార్డుపై చెలరేగిన వాగ్వాదం

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ వీడియో కర్ణాటకలో ఓ మహిళకు, బస్సు కండక్టర్ కు మధ్య జరిగిన గొడవను చూపుతోంది. 'ఘర్ కే కాలేష్' అనే ట్విట్టర్ పేజీలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో, ఇద్దరు ఐడి కార్డ్(ఆధార్ కార్డు) పై ఫైట్ చేస్తున్నట్టు చూడవచ్చు. బస్సులో ఉన్న కండక్టర్ స్వయంగా ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. సదరు మహిళ కూడా అతనిపై అరుస్తూ వీడియో రికార్డ్ చేయడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు.

సదరు వ్యక్తి ఆధార్ కార్డు చూపించాలని మహిళను కోరినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. తాను సెంట్రల్ ఎక్సైజ్ అధికారినని ఆ మహిళ పేర్కొంది. అయితే, ఆమె.. అతను అడిగిన ఐడీకి బదులుగా కొన్ని వేరే ఇతర ఐడీ కార్డులను చూపించింది. వీడియో మరి కొంచెం ముందుకు వెళ్ళి గమనిస్తే బస్సులో ప్రయాణించే మరికొంత మంది వ్యక్తులు కూడా ఆమెను ఏమి అడిగినా చూపించమని అడిగారు, కానీ ఆమె మాత్రం వినిపించుకోకుండా, బదులుగా వారిపైనే అరవడం ప్రారంభించింది.

AsloRead: ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్‌ ప్రమాణస్వీకారం

Kalesh b/w a Woman and Bus-Conductor in Karnataka over asking for ID card from her if she want’s to travel for freepic.twitter.com/9LA54M7Q7x

— Ghar Ke Kalesh (@gharkekalesh) July 27, 2023

ఈ వీడియో షేర్ అయిన కొద్ది సేపట్లోనే 1 లక్షా 68 వేల వ్యూస్ వచ్చాయి. "ఆమె టికెట్ కోసం చెల్లించకుండా ఆదా చేసిన దానికంటే ఎక్కువ డేటా ఛార్జీల కోసం ఖర్చు చేసి ఉంటుంది" అని ఒక ట్విటర్ యూజర్ కామెంట్ చేయగా... మరి కొందరు ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతకు ముందు, అంటే బస్సు ఎక్కే ముందు టికెట్ కొనమని కండక్టర్.. ఆ మహిళను డిమాండ్ చేశాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఆమె ప్రయాణించేందుకు తప్పనిసరిగా టికెట్‌ కొనుగోలు చేయాలని కండక్టర్‌ పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత వారు వాగ్వాదానికి దిగారు. బస్సులో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికులు గొడవ ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బస్సు వెలుపల నిలబడిన చాలా మంది ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.