ఒకేఒక్క క్లిక్ ఆమెను రోడ్డున పడేసింది..జాబ్ కోసం వెతుకుతున్న ఆమెను జాబ్ ఆశ చూపారు. ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేయమన్నారు.. మొదటి బాగానే ఆదాయం.. తర్వాత అధిక ఆదాయం ఆశ చూపారు.. క్రమక్రమంగా ఆమెను నమ్మించారు. స్కామర్ల మాటలు నమ్మిన ఆమెకు చివరికి మిగిలింది ఖాళీ బ్యాంక్ ఖాతా.. స్కామర్లు పంపిన ఇన్ స్టాగ్రామ్ లింక్ పై ఒక్క క్లిక్ ఆమె ఖాతాను ఖాళీ చేసింది. ఆన్ లైన్ ఫ్రాడ్ స్టర్లు పంపించిన ఇన్ స్ట్రాగ్రామ్ క్లిక్ చేసిన ఓ మహిళ లక్షలు పోగొట్టుకున్న సంఘటన కర్ణాటకలో జరిగింది.
అర్చన.. కర్ణాటక ఉడిపికి చెందిన 25యేళ్ల యువతి..జాబ్ కోసం వెతుకుతుండగా.. అమెజాన్ లో పార్ట్ టైం జాబ్ పేరుతో అమెజాన్ ఫ్రెషర్స్ జాబ్స్ ఇన్ ఇండియా పోస్ట్ ఒకటి ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లింక్ ద్వారా అందింది..జాబ్ కోసం వేటలో ఆమె అది ఓ వరంగా భావించింది. క్లిక్ చేసింది.. స్కామర్లు జాబ్ ఇచ్చారు.. లింక్ ల ద్వారా కొన్ని టాస్క్ లు ఇచ్చారు. పూర్తి చేసిన వెంటనే డబ్బులు ఇస్తూ మొదట్లో నమ్మించారు.. ఆతర్వాత మొదలైంది అసలు కథ.
Also Read : రిటైర్డ్ ఇంజినీర్‌ను నిర్బంధించి 10 కోట్లు దోచిన కేటుగాళ్లు
ఆన్ లైన్ ఫ్రాడ్ స్టర్లు అర్చన్ కు అధిక ఆదాయం ఆశచూపారు. కొంత పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందని నమ్మబలికారు. స్కామర్ల వలలో పడ్డ అర్చన.. దఫాలుగా వారి ఖాతాలను డ బ్బులు జమ చేసింది. ఇలా అక్టోబర్ 18 నుంచి 24 వరకు స్కామర్లు పంపించిన UPI ఖాతాలకు మొత్తం 1.95 లక్షలు రూపాయలను మనీ ట్రాన్స్ ఫర్ చేసింది. అయితే తనకు వచ్చిన ఆదాయాన్ని, పెట్టిన పెట్టుబడిని డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినపుడు విఫలమయ్యింది. స్కామర్లు ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేస్తే స్విచాఫ్.. మోసపోయాని తెలుసుకు అర్చన పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వంటి అవకాశాలు కోరుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ స్కామ్ లను రోజురోజుకు పెరిగిపోతున్నాయనడానికి అర్చన కేసు ఓ ఉదాహరణ.. ఆన్ లైన్ నమ్మశక్యం కానీ ఇన్ కమ్ సోర్సెస్ ను ఎప్పుడు నమ్మరాదని పోలీసులు చెబుతున్నారు.