బోన్ డొనేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా..అవయవదానం(ఆర్గాన్స్ డొనేషన్) గురించి మనందరికి తెలుసు..సాధారణంగా ఆర్గాన్ డొనేషన్ అంటే..గుండె, లివర్, కిడ్నీస్, కళ్లు వంటి అవయవాల దానం మాత్రమే అనుకుంటాం.. అయితే బోన్ డొనేషన్ కూడా చేయొచ్చని మనలో ఎంతమందికి తెలుసు..ఇటీవల కర్ణాటకలో ఓవ్యక్తి తొలిసారి బోన్ డొనేషన్( ఎముకలు) చేశాడు. ఆరుగురు చిన్నారులకు జీవితాన్ని ఇచ్చాడు.అసలు బోన్ డొనేషన్ అంటే ఏందీ..ఒక వ్యక్తి బోన్ డొనేషన్ ఎలా చేయొ చ్చు..డాక్టర్లు ఈ ఎముకలనుు ఇతరులకు ఎలా అమర్చుతారు వంటి విషయాలను తెలుసుకుందాం..
కర్ణాటకలోని సోమవారంపేట పరిధిలోని జంబూర్ కు చెందిన 32 యేళ్ల ఈశ్వర్ చనిపోయి ఆరుగురు చిన్నారులకు లైఫ్ ఇచ్చాడు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయంతో స్థానిక యూనివర్సిటీ హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందుతూ గత ఆదివారం ఈశ్వర్ చనిపోయాడు. అతని సోదరి ఈశ్వర్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. డాక్టర్లు కౌన్సిలింగ్ తర్వాత ఈశ్వర్ ఎముకలను దానం చేసేందుకు అతని సోదరి అంగీకరించింది.
ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ విక్రమ్ శెట్టి, మెడికల్ డైరెక్టర్ శాంతారామ్ శెట్టి నేతృత్వంలోని శస్త్ర చికిత్స బృందం.. ఈశ్వర్ డెడ్ బాడీనుంచి ఎముకలను స్టెరైల్ కండిషన్ లో బయటికి తీశారు.తర్వాత ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలతో బాడీని భర్తి చేసి బంధువులకు అప్పగించారు.
ఎముక దానం అంటే..
ఎముక దానం అనేది మరణించిన దాత నుండి ఎముకలను తిరిగి పొందడం. వాటిని కణజాల బ్యాంకులలో భద్రపరచడం. ఈ ఎముకలను బోన్ క్యాన్సర్, గాయం కారణంగా ఎముకలు విరగడం, పగుళ్లు, ఆర్థిపెడిక్ సర్జరీవంటి శస్త్రచికిత్సలలో ఉపయోగించవచ్చు.
బోన్ క్యాన్సర్: దానం చేసిన ఎముక బోన్ గ్రాఫ్ట్‌లతో క్యాన్సర్-బాధిత ఎముకను రీప్లేస్ చేయొచ్చు. విరిగిన ఎముకులను అతికించవచ్చు.
గాయాలు: దానం చేయబడిన ఎముకలు.. ప్రమాదం గాయపడి తీవ్రమైన పగుళ్లు లేదా వైకల్యాలు ఉన్నవారికి అవయవాలను రీప్లేస్ చేయొచ్చు.
ఆర్థోపెడిక్ సర్జరీలు: ఎముక అంటుకట్టుటను తరచుగా వెన్నెముక ఫ్యూషన్లు, కీళ్ల మార్పిడిలో కూడా దానం చేయబడిన ఎముకను ఉపయోగిస్తారు.
కర్ణాటకలో జరిగిన మొదటి ఎముకల దానం చేసిన వ్యక్తి ఈశ్వర్ కుటుంబాన్ని డాక్టర్ల బృందం ప్రశంసించింది. ఎముకల దానం జీవితాలను రక్షించడమే కాకుండా.. గ్రహీతల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన ప్రతి ఒక్కరూ ఎముకల దానం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది.