తొర్రూరు, వెలుగు : తెలంగాణ అభివృద్ధి ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో 9 లక్షల కోట్లు ఇచ్చారని బీజేపీ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పార్టీ ఆఫీస్‌లో అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అన్నారు. పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయడంతో ప్రజలకు బీజేపీపై నమ్మకం పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష లీడర్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొలుపుల శంకర్, ఎస్సీ మోర్చా అర్బన్ అధ్యక్షుడు మంగళపెళ్లి యాకయ్య, అర్బన్ ఉపాధ్యక్షుడు నడిగడ్డ ఉపేందర్, అర్బన్ కార్యదర్శి జలగం రవి, బీజేవైఎం అర్బన్ ప్రధాన కార్యదర్శి నూకల నవీన్, సోషల్ మీడియా కన్వీనర్ కుమ్మరికుంట్ల శివ, మండల నాయకులు పప్పుశెట్టి సంతోశ్ పాల్గొన్నారు.