కార్తీకమాసం.. దీపారాధన చేయడానికి నియమాలు ఇవే...

కార్తీకమాసం.. దీపారాధన చేయడానికి నియమాలు ఇవే...

హిందువులు జరుపుకునే పండుగల... శుభకార్యాలయాలు .. చేసే ముందు కచ్చితంగా దీపం వెలిగిస్తారు.  కొంతమంది వ్యాపారులు రోజూ పొద్దున్నే దుకాణం తీసిన వెంటనే శుభ్రం చేసి దీపం పెట్టే ఆచారాన్ని కూడా పాటిస్తారు.  ఇక దేవాలయాలకు..  పుణ్య నదుల్లో  స్నానం చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ కూడా దీపం వెలిగించి నదుల్లో వదులుతారు.  కార్తీకమాసం నెల రోజులు హిందువులు ఆవునెయ్యితో కాని.. నువ్వుల నూనెతో కాని దీపారాధ చేస్తారు.  దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయని పండితులు చెబుతున్నారు.   ఇప్పుడు ఆ నియమాల గురించి  తెలుసుకుందాం. . . 

దీపంలో  సకల దేవతలు.. నాలుగు వేదాలున్నాయని పండితులు చెబుతున్నారు.  హిందూ పురాణాల ప్రకారం దీపానికి ఒక విశిష్టత ఉంది. అందుకే దానిని చాలా నిష్టగా .. భక్తితో... ఒక క్రమ పద్దతిలో చేయాలి.  కార్తీకమాసం కొనసాగుతుంది. శివాలయాలు దీపాలతో నిండిపోతున్నాయి.  కొంతమంది ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకుంటున్నారు.  అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పురణాల ద్వారా తెలుస్తుంది.  లేదంటే ఆ పూజా ఫలితాన్ని పొందలేరని పండితులు చెబుతున్నారు. దీపం వెలిగించే కుంది గాని.. ప్రమిద గాని శుభ్రంగా ఉండాలి.  ఇది పగిలి ఉండకూడదు. పగిలిన దీపంలో దీపారాధన చేయడం వలన శుభ ఫలితాలు రాకపోగా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.  

  దీపారాధన కుందులు.. ప్రమిదల్లో  ముందు నెయ్యి గాని .. నూనె పోసి తరువాత ఒత్తులు వేయాలి,  దీపారాధనను అగ్గిపుల్లతో చేయకూడదు. ముందుగా ఏకహారతి వెలిగించి దాని ద్వారా దీపారాధన చేయాలి.  లేదంటే అగర్​ బత్తీ వెలిగింది దానితో దీపాలను వెలిగించాలి.  దీపారాధనలో ఎట్టి పరిస్థితిలో ఒక వత్తి ఉండకూడదు.  దీపారాధన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు అంటున్నారు. 

పూజ చేసే సమయం అంతా దీపం వెలిగేలా అందులో నెయ్యిగాని.. నూనె గాని  సరిపడ ఉండేలా చూసుకోవాలి.  పూజ ముగిసేలోపు దీపం కొండెక్కకుండా ( ఆరిపోకుండా) జాగ్రత్తలు తీసుకోవాలి.  ఒకవేళ  పూజ మధ్యలో దీపం ఆరిపోతే దానిని అపశకునంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో మధ్యలో మరో దీపాన్ని వెలిగించకూడదు.  నెయ్యితో దీపారాధన చేస్తే .. దానిలో నెయ్యి మాత్రమే వాడాలి.. నెయ్యి దీపం వెలిగించి... వెంటనే మరో దీపాన్ని నూనెతో దీపారాధన చేయకూడదు. దీపాన్ని పూజాస్థలం మధ్యలో ఉండాలి.  నెయ్యి దీపం వెలిగిస్తే మీకు ఎడమ దిక్కులో.... నూనె దీపం వెలిగిస్తే మీకు కుడి దిక్కులో దీపాన్ని ఉంచాలి.  అయితే ఎట్టి పరిస్థితిలో దీపారాధన ఉండకూడదు. ఇలా చేయడం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.  

సకల దేవతలనూ ఆహ్వానించేందుకు దీపారాధన చేస్తారు,  దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని పురాణాలు చెబుతారు,  అందుకే పూజలో భాగంగా దీపాన్నీ పూజిస్తారు. పూలూ అక్షతలూ జల్లుతారు, నైవేద్యం పెడతారు.